Big Stories

Microplastics Effects : మైక్రోప్లాస్టిక్స్ అదుపు కోసం కొత్త సిస్టమ్..

Microplastics Effects

Microplastics Effects : ప్లాస్టిక్స్ అనేవి వాతావరణంలో కాలుష్యాన్ని పెంచుతున్న వస్తువుల్లో ఒకటి. ముఖ్యంగా గాలిలో, నీటిలో ప్లాస్టిక్స్ వల్ల కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్లాస్టిక్స్ వినియోగాన్ని తగ్గించాలని చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయినా కూడా ఇప్పటివరకు పర్యావరణంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ మానవాళికి ప్రాణహానిగా తయారయ్యింది. తాజాగా ప్లాస్టిక్‌ను నివారించడం కోసం శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని కనిపెట్టారు.

- Advertisement -

మైక్రోప్లాస్టిక్స్ అనేవి కూడా ప్లాస్టిక్ ప్రపంచంలో ఒక భాగమే. ఇవి మామూలు ప్లాస్టిక్‌లాగా కాకుండా 5 మిల్లీమీటర్ల కంటే చిన్నగా ఉంటాయి. కానీ వీటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టం మాత్రం పెద్దదే. ఇప్పటివరకు మైక్రోప్లాస్టిక్స్‌ను నీటి నుండి తొలగించడానికి మెష్ ఫిల్ట్రేషన్ అనే పద్ధతి ఆచరణలో ఉంది. కానీ అది ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేయదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే దానికోసమే కొత్త పద్ధతిని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు జపాన్ శాస్త్రవేత్తలు. వారి ప్రయత్నం దాదాపుగా సక్సెస్ అయ్యింది కూడా.

- Advertisement -

జపాన్ శాస్త్రవేత్తలు నీటిలో నుండి మైక్రోప్లాస్టిక్‌ను తొలగించే ఒక మైక్రోఫ్యూయిడ్ సిస్టమ్‌ను కనిపెట్టారు. ఇది ఒకేసారి వేస్ట్‌వాటర్ నుండి 100 నుండి 200 యూఎమ్‌ల మైక్రోప్లాస్టిక్‌ను తొలగించగలదు, అది కూడా రీసర్కులేషన్ లేకుండా చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఈ సిస్టమ్‌రను వారు టెస్ట్ చేసి చూడగా 70 నుండి 90 శాతం వరకు సక్సెస్‌ఫుల్‌గా మైక్రోప్లాస్టిక్స్ తొలగిపోయాయని వారు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే మైక్రోప్లాస్టిక్స్ అనేవి అదుపు చేయడానికి ఇది మెరుగైన మార్గమని వారు భావిస్తున్నారు.

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2050లోపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో చేపల సంఖ్య కంటే మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువశాతం ఉండే అవకాశం ఉంది. అందుకే వీటిని నీటి నుండి తొలగించడం చాలా ముఖ్యం. ఇప్పటివరకు నీటిలో మెష్‌లను పెట్టి ఫిల్టర్ చేయడం వల్ల మైక్రోప్లాస్టిక్స్ అనేవి తొలగిపోయేవి. కానీ దీని వల్ల చాలా సమయం వృధా అయ్యేది, అంతే కాకుండా చాలా మ్యాన్ పవర్ కూడా కావాల్సి వచ్చేది. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా మైక్రోఫ్యూయిడ్ సిస్టమ్‌‌ను తయారు చేశారు శాస్త్రవేత్తలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News