BigTV English

Salakatla Teppotsavam:సాలకట్ల తెప్పోత్సవాల మహిమ

Salakatla Teppotsavam:సాలకట్ల తెప్పోత్సవాల మహిమ

Salakatla Teppotsavam:సూర్యజయంతి నాడు గడప దాటని గోవిందుడు… తెప్పోత్సవాలతో కనువిందు చేయనున్నాడు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు., ఉత్సవ ప్రియుడు కాబట్టే… ప్రతి నిత్యం ఏదొక ఉత్సవం ఆలయంలో జరుగుతూనే ఉంటుంది. వేసవి కాలం ప్రారంభంలో ప్రతి ఏటా స్వామి వారికి తెపోత్సవాలను ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమివనున్నారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనం ఇస్తారు.


రెండో రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో , 5,6 వ తేదీన శ్రీభూ సమేతంగా మలయప్పస్వామి ఐదుసార్లు పుష్కరిణిలో తిరిగి దర్శనం ఇస్తారు. చివరి రోజు మార్చి 7న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో దర్శనం ఇస్తారని వివరించారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

శ్రీవారి ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో వున్న పుష్కరిణిలో శ్రీవారి తెపోత్సవాలు జరుగుతాయి. 15వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు స్వామి వారి పుష్కరణిలో నిరాళి మండపాన్ని నిర్మించాడు. తెప్పోత్సవాల్లో మలయప్ప స్వామి ఐదు రోజుల పాటు మండపం చుట్టు ప్రదక్షణలుగా తెప్పలో విహరిస్తారు.


Kedarnath Temple:ఏప్రిల్ లో తెరుచుకోనున్న కేథార్ నాథ్ తలుపులు

Alcohol:ఏడాదికోసారి మద్యం పంచే ఆలయం ఎక్కడుంది ?

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×