E-Paper
Advertisement

Shukra Aditya Yoga 2024: జూన్ 12 నుంచి శుక్రాదిత్య యోగం.. ఈ రాశుల వారికి అన్నీ అదృష్టాలే..!

Shukra Aditya Yoga 2024: జూన్ 12 నుంచి శుక్రాదిత్య యోగం.. ఈ రాశుల వారికి అన్నీ అదృష్టాలే..!
Advertisement

Shukra Aditya Yoga 2024 from June 12th: శుక్రుడు సంపద, కీర్తి, ప్రేమ, సౌభాగ్యం, విలాసవంతమైన జీవితాలను ప్రసాదిస్తాడు. శుక్రుడు జూన్ 12న వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూలై 6 వరకు శుక్రుడు మిథున రాశిలోనే ఉంటాడు. సుమారు 406 రోజుల తర్వాత శుక్రుడు మిథున రాశిలోకి అడుగుపెడుతున్నాడు.

సూర్యుడు కూడా జూన్ 15వ తేదీన మిథున రాశిలో సంచరిస్తాడు. ఒకే రాశిలో సూర్య, శుక్ర గ్రహాల కలయిక జరుగుతుంది. ఫలితంగా శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా పవిత్రమైనది. సూర్య, శుక్ర కలయిక వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. శుక్రాదిత్య యోగంతో ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేషరాశి:
సూర్య, శుక్ర గ్రహాల కలయిక ప్రభావంతో మేషరాశి వారికి శుభాలు కలగనున్నాయి. మీ మాట తీరులో సౌమ్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో డబ్బు సంపాదిస్తారు. ఆఫీస్‌లోని ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తి చెందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా వృత్తి జీవితంలో కూడా శుభ వార్తలను అందుకుంటారు.

వృషభరాశి:
అనుకోని ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు. ఆత్మవిశ్వాసం, శక్తి మీలో పెరుగుతాయి. ప్రతి రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవిత సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారు. కెరీర్ ఎదుగుదల కోసం మీరు ఆశించిన అవకాశాలు లభిస్తాయి.

Advertisement

Also Read: Budh Gochar In Mithun: మరో 72 గంటల్లో అద్భుతం.. ఆ రాశుల వారి ఇంట్లోకి డబ్బులే డబ్బులు..

కర్కాటక రాశి:
ఈ రెండు గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంపద కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి.

సింహరాశి:

వృత్తి వ్యాపారంలో లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. డబ్బు సంపాదించేందుకు ఇది మంచి అవకాశం. పనిచేసే చోట వీరి పనికి ప్రశంసలు అందుతాయి. అంతే కాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం సాధించే ఆస్కారం కూడా ఉంది.

Also Read: మిథున రాశిలోకి బుధుడు.. ఈ రాశి వారికి వ్యాపారంలో భారీ లాభాలు

మిథున రాశి:
శుక్రాదిత్య యోగం మిథున రాశిలో ఏర్పడుతుంది. అందుకే మీకు మంచి రోజులు రానున్నాయి. పని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందుతారు. మీకు ఇది లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. దైవిక ఆదరణ ఆరాధన పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×