BigTV English

Surya Bhagawan : స్ఫూర్తి ప్రదాత.. సూర్య నారాయణుడు

Surya Bhagawan : స్ఫూర్తి ప్రదాత.. సూర్య నారాయణుడు
Surya Bhagawan

Surya Bhagawan : స్ఫూర్తి ప్రదాత.. సూర్య నారాయణుడుదైవ సాక్షాత్కారం కావాలంటే పూజలు, వ్రతాలు, తపస్సులు చేయాలి. కానీ.. సూర్య భగవానుడిని చూడాలంటే మాత్రం ఇవేమీ అవసరం లేదు. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అంటారు. మనదేశంలో యుగాలుగా సూర్యారాధన ఉంది.
‘సూర్యుడు’ అనే పదానికి ‘సువతి ప్రేరయితి జనాన్ కర్మణేతి సూర్యః’ అని వ్యుత్పత్తి. ‘మానవులు వారి కర్తవ్యాలను నిర్వహించుకోవడానికి ప్రేరణ ఇచ్చేవాడు’ అని దీని అర్థం. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని శాస్త్రవచనం.
జగత్తులోని జీవులన్నింటికీ ఆయనే ఆత్మ అని ఋగ్వేదం, సూర్యోదయంతోనే జగత్తులో ప్రాణాగ్ని సంచారం చేస్తుందనీ, ఆయన వల్లనే సమస్త ప్రాణికోటికీ ప్రాణశక్తి లభిస్తుందని ‘శతపథ బ్రాహ్మణం’ చెబుతున్నాయి.
సూర్యుడిపై ప్రత్యేకంగా రచించిన ఉపనిషత్తు ‘అక్ష్యుపనిషత్తు’. ఇది ఆయన లక్షణాలను మరింత వివరంగా మనకు చెబుతోంది. ఆయన ప్రస్తావన లేని పురాణం మన మొత్తం వాజ్ఞ్మయంలోనే కనిపించదు.
శరీరాన్ని కోరినట్లు తగ్గించుకొనే, పెంచుకునే గరిమ, లఘిమా అనే సిద్ధులను ఆంజనేయుడికి ప్రసాదించినది ఆదిత్యుడే. కుంతీదేవీ ఈయన ప్రసాదంగానే కర్ణుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
సూర్యోదయాన్ని గమనించిన విశ్వామిత్రుడు.. నిద్రిస్తు్న్న రామ లక్ష్మణులను మేలుకొలుపుతూ ‘పూర్వా సంధ్యా ప్రవర్తతే’ అనే మాట వాడారు.
మన సాహిత్యంలో ఎందరో కవులు, రచయితలకు సూర్యుడే ప్రేరణ. ఆదిశంకరుడి శివానందలహరి నుంచి పోతన భాగవతం వరకు సూర్యుడి ప్రస్తావన లేని రచనే కనిపించదు.
రోజూ ఖచ్చితమైన సమయానికి ఉదయిస్తూ, అస్తమిస్తూ ఉండే ఆ ప్రత్యక్ష దైవం.. మనిషి జీవితంలో సమయపాలన అవసరాన్ని పరోక్షంగా మనకందరికీ సూచిస్తుంటాడు.
జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు.. ఓపికతో మంచి రోజుల కోసం ఎదురుచూడాలని, తన సూర్యాస్తమయ, సూర్యోదయాల ద్వారా మనకు చెబుతుంటాడు.
పేదవాడి గుడిసె మీద పడే ఎండ, రాజు మేడ మీద పడే ఎండలో ఎలా తేడా ఉండదో, అలాగే… మనిషి అందరినీ సమానంగా చూడాలని రోజూ మనకు ఆ ప్రత్యక్షదైవం ఆచరణలో నిరూపిస్తున్నాడు.


Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×