E-Paper
Advertisement

Guru Uday 2024: వృషభ రాశిలో అదృష్టాన్ని కలిగించే దేవగురువు.. వీరికి అన్నింట్లో విజయాలే..

Guru Uday 2024: వృషభ రాశిలో అదృష్టాన్ని కలిగించే దేవగురువు.. వీరికి అన్నింట్లో విజయాలే..
Advertisement

Guru Uday 2024: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిగ గ్రహాన్ని ఆనందం, శ్రేయస్సు, సంపద వంటి వాటికి బాధ్యత వహించే గ్రహంగా పరిగణిస్తారు. ఏ రాశిలో అయితే బృహస్పతి గ్రహం ఉంటుందో వారికి అదృష్టం, ఆనందం, జ్ఞానం, కీర్తిని ఇస్తుంది. అయితే దేవగురువుగా పరిగణించే బృహస్పతి వృషభరాశిలో ఉదయించాడు. బృహస్పతి ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది. ఉన్నతమైన స్థానం, గౌరవం, ఆదరణ, సంపదలు లభిస్తాయి. అలాగే, ప్రేమ వివాహాల్లోను సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు ఉంటాయి. అయితే వచ్చే 1 సంవత్సరం పాటు పలు రాశుల వారికి అదృష్టం కలగనుంది. మరి ఆ రాశుల వివరాలు ఏంటో తెలుసుకుందాం.

రాశిచక్రాలపై గురు శుభ ప్రభావం

Advertisement

మేషం

మేష రాశి వారి జీవితంలో అన్ని అదృష్టాలు కలిసిరానున్నాయి. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక లాభం పెరిగి, జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతుంది. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Advertisement

వృషభం

బృహస్పతి వృషభరాశిలో మాత్రమే ఉదయిస్తున్నాడు. బృహస్పతి రాబోయే 1 సంవత్సరం పాటు ఈ రాశిలో ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. దాంపత్యంలో వస్తున్న సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక లాభం ఉంటుంది. పదవి, డబ్బు, శ్రేయస్సు లభిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ కూడా లభిస్తుంది.

కర్కాటకం

బృహస్పతి ఉదయించడం కర్కాటక రాశి వారికి కూడా మేలు జరుగుతుంది. కొంతమందికి ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు. పదవులు, ప్రతిష్టలు పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది.

కన్య

ఈ రాశి వారికి అనుకున్న పనులు పూర్తి అవుతాయి. సంపద, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. జీవితంలో ఆనందం ఉంటుంది. వైవాహిక సుఖాన్ని పొందుతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలను వినే అవకాశాలు ఉంటాయి.

కుంభం

కుంభ రాశి వారికి కూడా అనేక విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు అధిక లాభాలను పొందుతారు. వివాహ అవకాశాలు ఉన్నాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×