BigTV English
Advertisement

Lucky Zodiac Signs: జూన్ నెలలో ఐదు రాజయోగాలు.. ఈ రాశుల వారి అదృష్టం మామూలుగా ఉండదు

Lucky Zodiac Signs: జూన్ నెలలో ఐదు రాజయోగాలు.. ఈ రాశుల వారి అదృష్టం మామూలుగా ఉండదు

Lucky Zodiac Signs: జూన్ నెల ప్రత్యేకంగా మారనుంది. జూన్‌లో ఒకేసారి ఐదు రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా మూడు రాశుల వారికి భారీ ప్రయోజనాలు ఉంటాయి. వారి ఉద్యోగం, వ్యాపారం, వైవాహిత జీవితంలో ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. జూన్ నెలలో పెద్ద గ్రహాల సంచారం వల్ల ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.


నెల ప్రారంభంలో జూన్ 1న కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 3న గురువు, బృహస్పతి ఉదయించబోతున్నాడు. జూన్ 15న సూర్యుడు, వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 14న బుధుడు, మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 12న సాయంత్రం శుక్రుడు, మిథున రాశిలోకి వెళ్తాడు. జూన్ నెలలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడి సంచారం వల్ల శుభ యోగాలు ఏర్పడతాయి. ఈ రాశిలో ఏ రాజయోగం ఏర్పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బుధాదిత్యయోగం: బుధుడు, సూర్యుడు, మిథున రాశిలో జూన్ నెలలో ప్రవేశించనున్నారు. దీని వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అయితే ఇది శుభ యోగాలలో ఒకటిగా పరిగణిస్తారు.
త్రిగ్రాహియోగం: మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పరచనున్నారు. ఇది కూడా జూన్ నెలలోనే ఏర్పడుతుంది
శుక్రాదిత్య యోగం: మిథున రాశిలో సూర్యుడి కలయిక వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది. ఫలితంగా పలు రాశుల వారి కెరీర్‌లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ధన సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
గురు ఆదిత్య యోగం: వృషభ రాశిలో సూర్యుడు, బృహస్పతి కలిసి జూన్ 14 వరకు ఉంటారు. గురు ఆదిత్య యోగం వల్ల నవ గ్రహరాజుగా సూర్యుడిని భావిస్తారు. బృహస్పతి సంపద ఆనందాన్ని సూచిస్తాడు.
లక్ష్మీనారాయణ యోగం: ఇప్పటికే రెండు గ్రహాలు వృషభరాశిలో లక్ష్మీ నారాయణ యోగాన్ని ఏర్పరిచాయి. జూన్ నెలలో శుక్రుడు, బుధుడు కలిసి మిథున రాశిలో లక్ష్మీ నారాయణ యోగాన్ని సృష్టించబోతున్నారు.


వృషభరాశి:
ఈ ఐదు శుభ యోగాల వల్ల వృషభ రాశి వారికి శుభాలు కలుగుతాయి. పెట్టుబడుల ద్వారా జీవితంలో అనేక సౌకర్యాలను పెంచుకోగలుగుతారు. తల్లి ఆనందం కోసం డబ్బును ఖర్చు చేస్తారు. కెరీర్ పరంగా స్థిరత్వం ఉంటుంది. సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటారు. మంచి పనితీరు వల్ల ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయి. తద్వారా డబ్బును సంపాదిస్తారు. జీవితంలో కూడా ఆనందం, సంతృప్తి పొందుతారు.
మిథున రాశి:
మిథున రాశిలో మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని ద్వారా వీరికి శుభప్రదమైన కాలం రాబోతుంది. వీటి ప్రభావంతో వీరి జీవితం సుభిక్షంగా ఉంటుంది. ఉద్యోగాల్లో అనేక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారస్తులు కూడా అధిక లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీరు సాధించిన ప్రగతిని చూసి మీ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. సొంతంగా వ్యాపారం చేసుకునే వారు ఉన్నత స్థాయికి చేరుకుని మంచి లాభాలను పొందుతారు. జీవిత భాగస్వాములు ఇద్దరూ పరస్పరం స్నేహపూర్వకంగా సంబంధాలను కలిగి ముందుకు సాగుతారు.

Also Read: మే నెల చివరిలో అరుదైన రాజయోగం.. ఇక ఈ 3 రాశుల వారిపై కనక వర్షం కురవనుంది

మకరరాశి: 
జూన్ నెలలో వివిధ శుభ యోగాల వల్ల మకర రాశి వారు విజయాలు పొందుతారు. ఉద్యోగులు శుభఫలితాలు పొందుతారు. జీతాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. వ్యాపార భాగస్వామ్యానికి ఇది అనువైన సమయం. భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తారు.

Tags

Related News

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Karthika Pournami 2025: 365 వత్తుల దీపం.. వెనక దాగి ఉన్న అంతరార్థం ఏంటి ?

Life of Radha: కృష్ణుడిని ప్రేమించిన రాధ చివరకు ఏమైంది? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది?

Big Stories

×