BigTV English

Nandamuri Balakrishna: అంజలికే లేని బాధ మీకెందుకురా.. బాలయ్య ఫ్యాన్స్ వెర్షన్ వేరేలా ఉందే

Nandamuri Balakrishna: అంజలికే లేని బాధ మీకెందుకురా.. బాలయ్య ఫ్యాన్స్ వెర్షన్ వేరేలా ఉందే

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ. చివరగా మూస్ ఏ పబ్ వద్దకు పోయి నిలబడినా వినిపించే ఏకైక పేరు. నటన పరంగా బాలయ్యకు పేరు పెట్టలేం. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి నటిస్తాడు. విజయాపజయాలను పక్కన పెట్టి ఈ వయస్సులో కూడా అభిమానులను తన సినిమాలతో అలరిస్తున్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. బాలయ్యకు ఉన్న పెద్ద మైనస్ ఆయన కోపం. ఎక్కడున్నాం.. చుట్టూ ఎంతమంది ఉన్నారు.. ఏం మాట్లాడుతున్నాం .. ఇవేమి బాలయ్యకు పట్టవు.


కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే అనేవారు కూడా కొన్నిసార్లు ఆయనను విమర్శిస్తూనే ఉంటారు. ముఖ్యంగా బాలయ్య.. ఆడవారు.. మగవారు అని ప్రత్యేకంగా చూడడు. స్టేజిమీద మాట్లాడేటప్పుడు కూడా హీరోయిన్స్ తో మాట్లాడే ప్రవర్తన ఎప్పుడు ఎబెట్టుగానే ఉంటుంది. ఆయన పొగిడే విధానం బావున్నా.. మధ్యలో వేసే కౌంటర్లు అర్థంకాక పాపం భాషరాని హీరోయిన్లు తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు.

ఇక ఇప్పుడు బాలయ్య గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది అందరికి తెల్సిందే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ను అంజలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. బాలయ్యకు సంస్కారం లేదు అని, తాగి వచ్చి అమ్మాయిలతో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. స్టేజిమీద ఉన్న అంజలిని పక్కకు జరగమని తోసి మాట్లాడడం పద్ధతి కాదని, అంజలి భయపడిందని చెప్పుకొస్తున్నారు.


ఇక ఇదంతా వైసీపీ చేసిన కుట్ర అని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. అసలు అక్కడ జరిగింది వక్రీకరించి చూస్తున్నారని చెప్పుకొస్తున్నారు. బాలయ్యకు, అంజలికి ముందే పరిచయం ఉంది.. వీరిద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేశారు. ఆ చనువుతోనే బాలయ్య.. అంజలిని అలా తోసాడు. అప్పటికి అంజలికి రెండు సార్లు జరుగు జరుగు అని చెప్పినా వినిపించుకోకపోవడంతో పక్కకు జరుగు అని తోసాడు కానీ, అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించలేదని.. ఒకవేళ అంత దురుసుగా ప్రవర్తిస్తే అంజలినే కోపంతోనో.. బాధతోనో చెప్పేది అని.. అంజలికే లేని బాధ మీకెందుకురా అని బాలయ్య ఫ్యాన్స్ కొత్త వెర్షన్ వినిపిస్తున్నారు. మరి ఈ విషయమై అంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×