E-Paper
Advertisement

Lucky Baskhar: పవన్ కి పోటీ వస్తున్న మెగాస్టార్ తనయుడు.. గెలిచేది ఎవరు.. ?

Lucky Baskhar: పవన్ కి పోటీ వస్తున్న మెగాస్టార్ తనయుడు.. గెలిచేది ఎవరు.. ?
Advertisement

Lucky Baskhar: మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు దుల్కర్ సల్మాన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్ అక్కడ మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక మహానటిలో అమ్మాడి..అంటూ జెమిని గణేశన్ పాత్రలో నటించడం కాదు జీవించాడు. అప్పుడే తెలుగువారికి దుల్కర్ టాలెంట్ అర్ధమయ్యింది. ఇక ఆ తరువాత సీతారామం సినిమాతో తెలుగువాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత దుల్కర్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది.

ఇక సీతారామం తరువాత దుల్కర్ నటిస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్. సార్ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఇక అదే రోజున OG రిలీజ్ కు సిద్ధమవుతుందని మేకర్స్ ముందే ప్రకటించారు. అంటే OG తో లక్కీ భాస్కర్ పోటీ పడనున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు లక్కీ భాస్కర్ పోటీ వస్తున్నాడు అంటే సాహసమే అని చెప్పాలి.

ఇక పోస్టర్ కూడా సేమ్ OG పోస్టర్ ను కాపీ కొట్టినట్లే ఉంది. కారుకు ఆనుకొని పవన్ నిలబడగా.. కారు మీద చేయి ఆనించి దుల్కర్ నిలబడ్డాడు. ఇక ఈ డేట్ చూడగానే పవన్ ఫ్యాన్స్ లో గుబులు రేగుతుంది. పవన్ సినిమా వస్తుందని తెలిసినా కూడా నాగవంస్ ఈ డేట్ ను లాక్ చేసాడంటే.. కొంపతీసి OG రిలీజ్ వాయిదా పడదుకదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×