E-Paper
Advertisement

Sun venus conjunction: సూర్యుడు, శుక్రుడి కలయిక.. జూలైలో ఈ రాశుల వారికి అన్నీ శుభాలే !

Sun venus conjunction: సూర్యుడు, శుక్రుడి కలయిక.. జూలైలో ఈ రాశుల వారికి అన్నీ శుభాలే !

Sun venus conjunction: చంద్రుడికి చెందిన రాశిలో సూర్యుడు, శుక్రుడు సంచరించబోతున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశుల కలయిక శుభప్రదంగా పరిగణిస్తారు. గ్రహాల సంచారం, నక్షత్రాల స్థానాల పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైంది. జూలైలో గ్రహాల రాజు సూర్యుడు, సంపద సృష్టించే శుక్రుడు రాశి చక్రాలను మారనున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక చంద్రుడు రాశిలో జరగనుంది.

జూలై 7న శుక్రుడు, కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దాని తర్వాత జూలై 16న గ్రహాల రాజు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కంటే ముందుగానే బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం సూర్యుడు, శుక్రుడు, మిథున రాశిలో ఉన్నారు. కర్కటకరాశిలో సూర్యుడు, శుక్రుడి కలయిక జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైంది.

ఈ కలయిక జూలై 31 వరకు కర్కాటక రాశిలో ఉంటుంది. రెండు గ్రహాల కలయిక మరోసారి జరగడం వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది. కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడి సంయోగం మరోసారి జరుగనుంది. జూలై 31 తేదీన శుక్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచరించనున్నాడు. ముఖ్యంగా జూలై నెల మూడు రాశుల వారికి అదృష్ట కాలంగా మారనుంది. సూర్యుడు, శుక్రుడు కలిసి ఏ రాశులపై ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశిలోనే శుక్రుడు, సూర్యుడి కలయిక జగనుంది. అందుకే ఈ రాశి వారికి ఈ కాలం సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగం లో కూడా పురోగతి లభిస్తుంది. మీ భాగస్వామి సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా మీ ధన ప్రవాహానికి దారులు కూడా తెరుచుకుంటాయి.
కన్యా రాశి:
సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల కన్యా రాశి వారు కొన్ని శుభవార్తలు వింటారు. కెరీర్‌లో కొత్త విజయాలను సాధించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు వచ్చే ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలు కూడా విజయవంతం అవుతాయి. పెట్టుబడులకు ఇది అద్భుత సమయం. పాత పెట్టుబడుల నుంచి రాబడి పొందుతారు. మీకు ఈ కాలం ఆర్థిక, వృత్తి, ఆనందం పరంగా బాగుంటుంది.

Also Read: జూలై మొదటి వారం నుండే ఈ రాశుల వారి జీవితాల్లో అదృష్ట మార్పు

తులా రాశి:
సూర్యుడు, శుక్రుడి కలయిక తులా రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలను వింటారు. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఇది మంచి సమయం. లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు మీరు పొందుతారు. ఊహించని విధంగా ధన ప్రవాహం ఉంటుంది. అంతే కాకుండా వైవాహిక జీవితం బాగుంటుంది. విద్యార్థులు కెరీర్ పరంగా శుభవార్తలు వింటారు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×