BigTV English

Heavy Rains in Hyderabad : తడిసిముద్దైన హైదరాబాద్.. రేపు కూడా తెలంగాణలో భారీ వర్షాలు!

Heavy Rains in Hyderabad : తడిసిముద్దైన హైదరాబాద్.. రేపు కూడా తెలంగాణలో భారీ వర్షాలు!

Heavy Rains in Hyderabad: హైదరాబాద్ నగరంలోని గురువారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కూకట్ పల్లి, హైదర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, బోరబండ, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, మైత్రీవనం, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ రామంతాపూర్, ఉప్పల్ తోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మ్యాన్ హోల్స్, నాలాలు పొంగిపొర్లుతున్నాయి.


రహదారులపై వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే అలర్టైన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో రోడ్లు చెరువులను తలపించాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచించారు.

మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. జూన్ 28న హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొన్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.


ఇటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, అనంతపురం తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Also Read: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. అసదుద్దీన్ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువగా..

Traffic Jam at IKEA
Traffic Jam at IKEA

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ఐకియా నుంచి బయోడైవర్సిటీకి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఐకియా జంక్షన్ వద్ద వాహనాలు బారులు తీరాయి. రోడ్డుకు ఇరువైపుల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అలాగే ఐటీ ఉద్యోగులు దశల వారీగా వెళ్లాలన్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×