BigTV English

Camphor:ప్రసాదంగా వచ్చే పచ్చకర్పూరాన్ని ఇలా చేయచ్చు…

Camphor:ప్రసాదంగా వచ్చే పచ్చకర్పూరాన్ని ఇలా చేయచ్చు…

Camphor:తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పచ్చకర్పూర తిలకాన్ని పెడతారు. భక్తులు దేవునికి కానుకలను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు. ఈ ప్రసాదాన్ని కొంతమంది భక్తులు తింటారు. మరికొందరు డబ్బాలో పెడతారు. స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగాలి. అలా స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది. పచ్చ కర్పూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు పూసుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది


కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. కర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే ఎటువంటి జలుబు, తలనొప్పి నయమైపోతుంది. పచ్చ కర్పూరాన్ని తీపి పదార్ధాలకు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే-మీ ఇంట శుభ కార్యాలు త్వరగా జరుగుతాయి. పచ్చ కర్పూరాన్ని కలిపిన నీటిని ప్రతి రోజు తాగితే గ్యాస్ట్రిక్ సమస్య, దంత దుర్గంధం దరిచేరవు.

పచ్చ కర్పూరం శ్రీ మహాలక్ష్మి ఫోటో కి ఎదురుగా కానీ లేదా ప్రతిమకు ఎదురుగా ఒక గిన్నెలో వేసి ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.వ్యాపారాలు చేసేవారు పచ్చ కర్పూరాన్ని లాకర్ లో ఉంచడం వారి వ్యాపారం దినదినాభివృద్ధి జరుగుతుంది. పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే మీకు రాజ సన్మానం,సమాజంలో గౌరవం ఎక్కువ అవుతుంది. పిల్లలు లేని వారు పాలకు పచ్చ కర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య దేవునికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ వుంటే దోషాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. డబ్బుల పెట్టెలో పెడితే ఎక్కువ ధన లాభం కలుగుతుంది. వ్యాపారులు ప్రతి రోజు పచ్చ కర్పూరపు కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారంలో రాణిస్తారని నమ్మకం.


Parrot:రామచిలుకను పెంచుకుంటే…

Chimakurti:చీమకుర్తిలో చిత్రమైన విగ్రహం …

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×