BigTV English

kodungallur : వింత ఆచారం .. అమ్మవారిపై బూతులు!

kodungallur : వింత ఆచారం .. అమ్మవారిపై బూతులు!
kodungallur

kodungallur : సాధారణంగా మనం గుడికి వెళ్తే.. భక్తితో దేవుడిని పూజిస్తాం. కానీ ఓ గుడికి వెళ్తే మాత్రం దేవుడిని తిట్టాల్సిందే. పైగా భక్తి పాటలకు బదులు.. తిట్ల పాటలు ఉంటాయి. ఆ గుడిలో పూజలు, కొబ్బరికాయ కొట్టడాలు ఉండవు. అదే అక్కడి ఆచారం. మరి ఆ గుడి ఎక్కడ ఉంది? ఇంకా ఆ గుడికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం.


కొడుంగల్లూర్ భగవతీ ఆలయం
కేరళలోని అత్యంత శక్తివంతమైన పీఠాలలో ఒకటైన ‘కొడుంగల్లూర్ భగవతీ ఆలయం’ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న అమ్మవారి రూపంతో పాటు ఏటా జరిగే 7 రోజుల ఉత్సవాలు విచిత్రంగా ఉంటాయి. ఆ ఏడు రోజుల ఉత్సవాల్లో భక్తులు కత్తులతో తలపై దాడి చేసుకుని.. ఆ రక్తంతోనే గుడిలోకి వెళ్తారు.

గుడిపైకి రాళ్లు విసురుతారు!
గుడిలోకి వెళ్లి భద్రకాళీ అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు.. భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో ఆగకుండా పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. గుడిపైకి రాళ్లు విసురుతారు. ఆ 7 రోజుల ఉత్సవాల తర్వాత.. వారంరోజులపాటు ఆలయాన్ని మూసివేసి ఆ రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. ఇలా చేస్తే వారికి మంచి జరుగుతుందని వారి నమ్మకం.


Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×