E-Paper
Advertisement

History of Tanot Mata Temple : బాంబు దాడికి చెక్కు చెదరని ఆలయం

History of Tanot Mata Temple : బాంబు దాడికి చెక్కు చెదరని ఆలయం
Advertisement
History of Tanot Mata Temple

History of Tanot Mata Temple : దేశంలో వందల సంవత్సరాలు క్రితం నిర్మించిన ఆలయాలు నలువైపులా ఉన్నాయి. అందులో ఒకటి ఇండో పాక్ సరిహద్దుల్లో తన్నోట మాత ఆలయం ఒకటి. దేశ సరిహద్దుల్లో ఉండే ఆలయం ఎంతో ప్రత్యేకమైంది. భౌగోళికంగా గుడి ఉన్న ప్రాంతం కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. జై సల్మేర్ జిల్లాలో ఉన్న ఆలయం ప్రత్యర్ధి దేశం విసిరిన బాంబు దాడుల్ని కూడా తట్టుకుని నిలబడింది. ఒక యుద్ధాన్ని చూసింది. హింగ్లాజ్ , కర్ణి మాతా రూపాల్లో కూడా తన్నోటిమాతను ఆరాధిస్తుంటారు. పాక్ సరిహద్దులకు అతి చేరువలో ఉంది ఆలయం. ఈ ఆలయానికి రావాలంటే ప్రయాణం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇసుక దిబ్బలు, పర్వతాలు మధ్య ఉన్న రోడ్డు మార్గం మీదుగా గుడికి చేరుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఇండో-పాక్ యుద్ధ సమయంలో ఈ ఆలయాన్ని శత్రుదేశం టార్గెట్ చేసింది. ఎన్ని బాంబులు విసిరినా అమ్మవారి దయ వల్ల ఆలయానికి ఎలాంటి ప్రమాదం జరగనీయకుండా చూసుకుంది. ఈ ఆలయ భద్రతను సరిహద్దు దళమే నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంతం బీఎస్ఎఫ్ పరిధిలో ఉంటుంది. అమ్మవారికి శక్తికి నిదర్శనం ఇక్కడ పేలకుండా ఉన్న బాంబులు. ఆలయంపై నాడు పాకిస్థాన్ వేసి బాంబుల్లో కొన్నిపేలనవి ప్రదర్శనగా ఉంచారు. ఆలయ ఉన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా భక్తులు ఎప్పుడుపడితే అప్పుడు అక్కడికి వెళ్లే అవకాశం ఉండదు. నవంబర్ నుంచి జనవరి వరకు వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది . ఆ సమయంలో దేవిని దర్శించుకోవచ్చు.

ఈ ఆలయం మీదుగా సైన్యం తమ వాహనాలకి ఇక్కడ పూజలు చేయిస్తుంది. ఈ నేల మట్టిని బొట్టుగా పెట్టుకుని పహారా కాస్తుంటుంది . బీఎస్ ఎఫ్ ట్రస్ట్ ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది. సాధారణ భక్తులతో కలిసి సైనికులు ఆలయంలో అమ్మవారిని భజన చేస్తూ కొలుస్తుంటారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×