E-Paper
Advertisement

Chandra Grahan 2024 in Pitru Paksha : పితృ పక్షంలో చంద్ర గ్రహణం.. ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త !

Chandra Grahan 2024 in Pitru Paksha :  పితృ పక్షంలో చంద్ర గ్రహణం.. ఈ 4 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త !

Chandra Grahan 2024 in Pitru Paksha : దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది పితృపక్షం గణేశోత్సవం తర్వాత ప్రారంభం కానుంది. హిందూ మతంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పితృపక్షంలో పూర్వీకులకు తర్పనం, పిండ దానం చేయడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరంలో పితృపక్షంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీంతో
చంద్రగ్రహణం శ్రాద్ధ పండుగ ఆచారాలపై ప్రభావం చూపనుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు పలు రాశుల జీవితాలపై కూడా చంద్ర గ్రహణం ప్రభావం చూపనుందని అంటున్నారు. అయితే ఆ రాశుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 చంద్రగ్రహణం తేదీ, సమయం

ఈ ఏడాది శ్రాద్ధ పండుగ సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభం కానుంది. తిరిగి అక్టోబర్ 2 వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ తరుణంలోనే సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ ఏడాదిలో ఇది రెండవ చంద్రగ్రహణం. ఇది భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 6:12 గంటలకు ప్రారంభం అవుతుంది. తిరిగి భారత కాలమానం ప్రకారం ఉదయం 10:17 వరకు ఉంటుంది.

భారతదేశంలో గ్రహణం కనిపిస్తుందా ?

తొలి చంద్రగ్రహణం మాదిరిగానే ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది. కానీ మొదటి చంద్రగ్రహణం భారత దేశంలో దర్శనమివ్వలేదు. ఈ మాదిరిగానే రెండో చంద్రగ్రహణం కూడా భారత దేశంలో కనిపించదు. ఈ చంద్ర గ్రహణం కేవలం దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ యూరప్ దేశాల్లో కనిపించనుంది.

పితృ పక్షంలో ‘ చంద్ర గ్రహణం ‘

ఈ ఏడాది పితృ పక్షం లేదా శ్రాద్ధ పక్షంలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే ఇలా శ్రాద్ధ పండుగ సమయంలో గ్రహణం ఏర్పడడం మంచిది కాదని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారత దేశంలో కనిపించదు కాబట్టి ఇది శ్రాద్ధం, తర్పణం, పిండదానం మొదలైన పూర్వీకులకు చేసే కర్మలపై ఎటువంటి ప్రభావం చూపదని పండితులు చెబుతున్నారు.

పలు రాశులపై ప్రభావం

భారతదేశంలో గ్రహణం కనిపించనప్పటికీ, ఇది అన్ని రాశులను ప్రభావితం చేయనుందని శాస్త్రం చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పితృ పక్షంలో చంద్ర గ్రహణం 4 రాశుల వారికి అశుభం కానుంది. ఈ రాశుల వారు నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి ఆర్థిక సంక్షోభం మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో సమస్యలు ఉండవచ్చు. ఒత్తిడి, చికాకులకు గురవుతారు.

సింహ రాశి

చంద్ర గ్రహణం వల్ల సింహ రాశి వారికి ఆర్థిక విషయాల్లో నష్టం కలుగుతుంది. కెరీర్‌లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. వ్యాపారంలో నష్టం రావచ్చు. ఎవరికీ చెడ్డ పనులు చేయవద్దు.

మకర రాశి

మకర రాశి ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ఆస్తి విషయంలో వివాదాలు రావచ్చు. అనవసరమైన తగాదాలకు దిగకండి మరియు ఖర్చులను అదుపులో ఉంచుకోండి.

మీన రాశి

మీన రాశి వారు లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. ఎవరైనా ఆర్థిక నష్టం కలిగించవచ్చు. అప్పు ఇవ్వవద్దు. ఇవ్వాల్సి వస్తే రాత పూర్వకంగా తీసుకోండి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×