BigTV English

Buying Gold Jewellery: బంగారం కొంటున్నారా..? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే!

Buying Gold Jewellery: బంగారం కొంటున్నారా..? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే!

Buying Gold Jewellery First Check the Purity: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధరలు పెరిగిపోతున్నప్పటికీ దేశంలో బంగారంపై ఇష్టం తగ్గడం లేదు. భారతీయుల సంప్రదాయం ప్రకారం బంగారం కొనుగోలు చేస్తే సిరిసంపదలు కలుగుతాయన్నది విశ్వాసం. అందుకే చాలామంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఏ నగల దుకాణం చూసిన బంగారం కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. మన దేశంలో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా కారణాలు ఉన్నాయి.


బంగారం కొనుగోలు చేయడం దేశంలో ఆనవాయితీగా భావిస్తారు. కొంతమంది పెట్టుబడిగా భావిస్తుంటారు. మరికొంతమంది వీటిని ధరించడం ఫ్యాషన్‌గా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వీటిని ధరిస్తుంటారు. పండుగలు, శుభకార్యాల సమయంలో ఎక్కువగా బంగారు నగల విక్రయాలు జరుగుతుంటాయ. అయితే ధరలు పెరుగుతున్నప్పటికీ..ఎక్కువ రేటు చెల్లించి కొంటున్న సమయంలో బంగారం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు కొనాలనుకుంటే.. ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

బంగారం కొంటున్నప్పుడు తీసుకోవాల్సిన అతిముఖ్యమైన జాగ్రత్త దాని స్వచ్ఛత. ఈ లోహం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. దేశంలో బంగారు ఆభరణాలను ధృవీకరించడంతోపాటు హాల్ మార్క్ చేసే బాధ్యత, తనిఖీలను బీఐఎస్ నిర్వహిస్తుంది. అయితే ఆభరణాలను అచ్చంగా బంగారంతోనే తయారుచేయడం సాధ్యం కాదు. కావున ఇతర లోహాలను ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ లోహాలు ఎంత మోతాదులో కలిపారనే విషయంపై బంగారం స్వచ్ఛత ఆధారపడుతుంది. అందుకే బంగారం కొనాలనుకునే వారు తప్పనిసరిగా బీఐఎస్ మార్క్ ఉందో చెక్ చేసుకోవాలి.


బీఐఎస్ వెబ్‌సైట్ ప్రకారం..బంగారం స్వచ్ఛతను 14k, 18k, 20k, 22k 23k, 24k వంటి ఆరు రకాలు విభజించారు. 22KT బంగారు ఆభరణాల్లో 91.6 శాతం బంగారం ఉండగా..18KT అయితే 75 శాతం బంగారం ఉంటుంది. దీంతో పాటు ఆభరణాలపై హాల్ మార్క్ ఆధారంగా ఎంత శాతం బంగారం, మెటల్ ఉంటుందనే విషయం తెలుస్తుంది.

హాల్ మార్కింగ్ తనిఖీ చేయడంతో పాటు ధరలను పోల్చుకోవడం ముఖ్యమే. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు మారుతూ ఉంటాయి. బంగారం స్వచ్ఛత ఆదారం కొనుగోలు చేయాలి. ఏదైన బంగారం ఆభరణంపై 22K916 ముద్ర ఉంటే అందులో 91.6శాతం బంగారం, 8.4 శాతం ఇతర మెటల్ ఉంటుంది. దీంతోపాటు 18K750 అని ఉంటే 75 శాతం బంగారం ఉందని, 14K 585 అని ముద్ర ఉన్నట్లయితే అందులో 58.5 శాతం బంగారం ఉంటుంది. వీటి ఆధారంగా బంగారాన్ని కొనుగోలు చేయాలి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే సమయంలో మరొక్క విషయం ఏంటంటే..మేకింగ్ ఛార్జీలను తెలుసుకోవాలి. ప్రస్తుతం ఆభరణాల తయారీలో ఒక్క శాతం మాత్రేమే ఉంటుంది. కావున మేకింగ్ ఛార్జీ మారుతూ ఉంటుంది. ఆభరాణాలు ఎంచుకున్న ఆధారంగా ఎంతవరకు ధరలను తగ్గించుకోవచ్చు.

అన్ని బంగారు ఆభరణాలకు ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ కోడ్‌ను భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు హాల్ మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికి ఒక హెచ్‌యూఐడీ నంబర్ కేటాయిస్తారు. ఈ కోడ్ సహాయంతో మీ బంగారం స్వచ్ఛమైనదో కాదో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు.. హర్యాణా ఎన్నికల ముందు బిజేపీ మాస్టర్ ప్లాన్!

బంగారం కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలు పాటించకపోతే మోసపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. బంగారాన్ని ఎక్కడా కొన్నా తరుగు, మజూరీకి పోతుంది. అయితే ఎక్కువగా డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండే ఆభరణాల విషయంలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆభరణంలో అద్దిన రాళ్ల బరువును సైతం బంగారంగా చూపిస్తారు. రాళ్ల స్వచ్ఛతను అంచనా వేయడం కష్టం. కావున కొంతమంది తయారీ ధరలను తగ్గించి మార్కెటింగ్ చేసుకుంటారు.

బీఐఎస్ హాల్ మార్కింగ్ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన దుకానికి కాకుండా ఇతరు దుకాణాలకు విక్రయించకుండా ఉండడమే మంచిది. ఇలా చేస్తేనే బై బ్యాక్ పాలసీతో పాటు నికర విలువలో వంద శాతం బంగారం పొందేలా చేస్తుంది. ముఖ్యంగా బిల్లులు లేకుండా ఆభరణాలను కొనుగోలు చేయవద్దు. 50వేల కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే పాన్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తరుణంలో కొంతమంది బిల్లులు లేకుండా ఆభరణాలు కొంటుంటారు. కావున మోసపోవడానికి ఇక్కడే ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రతీ ఆభరణంపై తప్పనిసరిగా బిల్లులు తీసుకుంటే మోసపోకుండా కట్టడి చేయవచ్చు.

Related News

Gold Rate Dropped: అబ్బా చల్లని కబురు.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

Rental Areas in Hyderabad: హైదరాబాద్ లో అద్దె ఇల్లు కావాలా? ఏ ఏరియాల్లో రెంట్ తక్కువ అంటే?

EPFO Atm Withdrawal: ఈపీఎఫ్ఓ నుంచి మరో బిగ్ అప్డేట్.. త్వరలో ఏటీఎం తరహాలో నగదు విత్ డ్రా!

Maruti Suzuki – GST: ఓ వైపు దసరా సేల్స్, మరోవైపు జీఎస్టీ తగ్గింపు.. అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి సుజుకి!

BSNL Offers: రీఛార్జ్ చేసుకోండి.. 2% డిస్కౌంట్ పొందండి, కస్టమర్లకు BSNL క్రేజీ ఆఫర్!

GST 2.0: కొత్త జీఎస్టీతో పన్ను తగ్గలేదా? నెంబర్ ఇదిగో, సామాన్యుడు ఫిర్యాదు చేయొచ్చు

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Big Stories

×