BigTV English

Lakshmi Devi: ఇవి పాటించండి.. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది

Lakshmi Devi: ఇవి పాటించండి.. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది

Lakshmi Devi: ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైంది. డబ్బు ఉంటేనే ఏ పనులైనా జరుగుతాయి. డబ్బులేకపోతే అన్నీ సమస్యలు చుట్టుముడతాయి. లక్ష్మీదేవి ఉంటే దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు శక్తివంతమైన నియమాలు పాటిస్తే లక్ష్మీ దేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఏం చేస్తే డబ్బు ఇంట్లోకి వస్తుంది? వచ్చిన డబ్బు ఎలా నిలుస్తుంది? వంటి విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


  • బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. బిర్యానీ ఆకు పరిహారం చేయడానికి ఇంటి ఇల్లాలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో ఉన్న పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకులు పెట్టి పూజించాలి. వంటింట్లో నుంచి బిర్యానీ ఆకులు తీసుకోకుండా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కొన్న బిర్యానీ ఆకులు మాత్రమే పూజలో వాడడం మంచిది. పూజ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకులు మీ జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.
  • మనలో చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా ఇళ్లు కట్టుకోడానికి చేతిలో డబ్బులు ఉండవు. అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన కుండను తెచ్చి స్థలానికి ఈశాన్య దిశలో ఉంచాలి. అలా పెట్టడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఇల్లు త్వరగా కట్టుకునేందుకు వీలు పడుతుంది.
  • చాలా మంది కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఎప్పుడు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బయట నుంచి ఎవరైనా ఇంట్లోకి కాళ్లు కడుక్కోకుండా రాకూడదు. ఇంటి బయట తులసి మొక్కను పెంచడం వల్ల కూడా లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. ఐదు తులసి ఆకులను తీసుకుని వాటిని ఎర్రటి గుడ్డలో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
  • కాలికి నల్ల ధారం కట్టుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. అంతే కాకుండా మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల దిష్టి కూడా తగలకుండా ఉంటుంది. స్ట్రీలుఎడమ కాలికి, పురుషులు కూడి కాలికి మాత్రమే నల్ల దారాన్ని కట్టుకోవాలి.
  • రోజు పూజ చేయకపోయినా సోమవారం పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. దేవతలదరూ ఆరాధించేది కూడా శివుడినే కాబట్టి సోమవారం శివుడికి పూజ చేస్తే దేవతలందరి అనుగ్రహం పొందుతాము.
  • అప్పుల బాధ తీరాలనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి. శుక్రవారం సాయంత్రం కొండ రాళ్ల ఉప్పును తీసుకుని దానిపైన రెండు లవంగాలను వేసి ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టుకోవాలి. తర్వాత శనివారం రోజున ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి. ఇలా మూడు శుక్రవారాలు చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తగ్గుతాయి.
  • చాలా మంది ఇంట్లో మంచంపైన కూర్చుని భోజనం చేస్తుంటారు. ఇలా భోజనం చేయడం వల్ల ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కరిగిపోతుంది. ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా మంచంపై కూర్చొని భోజనం చేయడాన్ని మానుకోవాలి. వాస్తు ప్రకారం ఉత్తరముఖంగా కూర్చుని తినడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టం. రోజు ఎర్ర గులాబీలను నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.


Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×