BigTV English
Advertisement

Anant Radhika Car Collection: కాస్ట్‌లీ పెళ్లి.. కోట్ల రూపాయల కార్లు.. ఎన్నేసి ఉన్నాయంటే!

Anant Radhika Car Collection: కాస్ట్‌లీ పెళ్లి.. కోట్ల రూపాయల కార్లు.. ఎన్నేసి ఉన్నాయంటే!

Anant Radhika Car Collection: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రమే హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక. ఈ వివాహం ప్రతి ఒక్కరి నోళ్లలో వినిపిస్తోంది. ఎందుకంటే దేశంలో బిజినెస్, ఆస్తి, ఇల్లు లేదా కార్లు విషయాల గురించి మాట్లాడితే ఒక పేరు మొదటగా గుర్తుకు వస్తుంది. అదే అంబానీ కుటుంబం. ఈ కుటుంబంలో అనేక అత్యాధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిని చూసి కార్ ప్రియులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖేష్, నీతా అంబానీల కార్ల గురించి మనం ఇప్పటికే చాలాసార్లు విన్నాము. ఇప్పుడు అనంత్ రాధిక కార్ల కలెక్షన్‌‌పై ఓ లుక్కేద్దాం.


Bentley Continental GTC
బెంట్లీ కాంటినెంటల్ GTC అనే అత్యంత విలాసవంతమైన కారు. రోల్స్ రాయిస్ డ్రాప్ హెడ్ కాకుండా ఈ బెంట్లీ అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా ముఖేష్, నీతా అంబానీల నుండి బహుమతిగా అందించారు. భారతదేశంలో GTC ధర రూ. 3.71 కోట్లు, దాని టాప్ మోడల్ 6.0-లీటర్ W12 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 626 bhp పవర్‌ని,  820 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.

BMW i8
BMW i8 దాని డిజైన్, డోర్లు, హైబ్రిడ్ ఇంజిన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. BMW i8 ధర రూ. 2.62 కోట్లు (ఎక్స్-షోరూమ్), హైబ్రిడ్ సిస్టమ్‌తో 1.5-లీటర్ మూడు-సిలిండర్ ఇంజన్‌తో 228 bhp పవర్,  320 Nm పీర్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.


Mercedes-Benz S-Class
Mercedes-Benz S-క్లాస్ ప్రత్యేకంగా W221 మోడల్. ఈ కారు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో లేదు. ప్రస్తుత జనరేషన్ Mercedes-Benz S-క్లాస్ 362 bhp పెట్రోల్ ఇంజన్ లేదా 282 bhp డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఎస్-క్లాస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.76 కోట్ల నుండి ప్రారంభమవుతుంది.

Mercedes-Benz G63 AMG
రేంజ్ రోవర్, G వ్యాగన్ ఏదైనా లగ్జరీ కార్ల కలెక్షన్స్‌లో మెర్సిడెస్-బెంజ్ G63 AMGని కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యువ జంట కూడా  G63 AMGని కలిగి ఉన్నారు. ఇది 577 bhp పవర్, 850 Nm టార్క్‌ను రిలీజ్ చేసే 4.0-లీటర్ V8 ఇంజిన్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4 కోట్లు.

Also Read:  అంబానీ ఇంట పెళ్లిసందడి.. అతిథుల లిస్ట్ లో దేశవిదేశాల రాజులు, రాణులు

Range Rover Vogue
సంపన్నులు రేంజ్ రోవర్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ జంట వోగ్‌ని కలిగి ఉంది. దీని ధర రూ. 2.38 కోట్లతో ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్). రేంజ్ రోవర్ విలాసవంతమైన అలానే ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది సెలబ్రిటీలకు ఇష్టమైన కారు. రేంజ్ రోవర్‌లో పెట్రోల్, డీజిల్ లేదా హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది.

Related News

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Big Stories

×