BigTV English

Magha Purnima 2024: రేపు ఏ రాశుల వారు ఏం చేయాలంటే..!

Magha Purnima 2024: రేపు ఏ రాశుల వారు ఏం చేయాలంటే..!

Magha Purnima 2024: అత్యంత పవిత్రమైన మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఘడియల్లో సూర్యోదయానికి ముందే చేసే పుణ్యస్నానం, విష్ణుపూజ విశేష ఫలితాన్నిస్తాయని తెలిసిందే. ఈ పున్నమి రోజు రవి, శోభన యోగం, ఆశ్లేష నక్షత్రంలో జరగటంతో బాటు కుంభ రాశిలో రవి, శని, బుధ గ్రహాలు కలవటంతో త్రిగ్రాహి యోగం కూడా కొనసాగనుంది. దీనివల్ల మేష, కర్కాటక, కన్య, తుల, కుంభ రాశుల వారికి ధనయోగం సిద్ధించబోతోంది.


ఇక.. ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణీ సంగమంలో జరుగుతున్న మాఘ కుంభమేళా కూడా నేటి పౌర్ణమితో ముగియనుంది. ఈ రోజున నిరుపేదలకు నువ్వులు, దుప్పట్లు, ఆహారం దానం చేయటం వల్ల జాతకపరమైన దోషాలు తొలగిపోతాయి. అలాగే సూర్యాస్తమయ సమయంలో చంద్రునికి అర్ఘ్యం సమర్పించటం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. అలాగే.. ఈ రోజున ఆయా రాశుల వారు ప్రత్యేకంగా కింది సూచనలు పాటించటం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.

మేష రాశి: తిండి గింజలు, వస్త్రాలు, ఆకుపచ్చని కూరగాయలు దానం చేయాలి.


వృషభ రాశి: ఆవాలు, శనగ పప్పు, పసుపు పచ్చని దుస్తులు దానం చేయాలి.

మిథున రాశి: నీలం రంగు పుష్పాలు, ఎర్రని ధాన్యం, పసుపు రంగు పండ్లు దానం చేయాలి.

కర్కాటకం: స్నానానంతరం పాదరక్షలు, గొడుగు, నల్లని వస్త్రాలు దానం చేయాలి.

సింహం: నీలం రంగు దుస్తులు, పూలు, ఆకుపచ్చని కాయగూరలు దానంచేయాలి.

కన్యా రాశి: గోధుమల దానంతో బాటు రాగి వస్తువులు, బెల్లం వంటివి దానం చేయాలి.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×