Kashi Varanasi: మొదటి సారి కాశీ వెళ్తున్నారా..? అక్కడ ఆలయ దర్శనం అకామడేషన్ గురించి మీకేం తెలియదా..? అయితే ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
ఫస్ట్ టైం వారణాసి టెంపుల్ దర్శనానికి వెళ్తున్న వాళ్లు అక్కడ ఎలా దర్శనం చేసుకోవాలి. ఏయే ఆలయాలను సందర్శించాలి. ఎక్కడ స్టే చేయాలి. ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది లాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకుని వెళితే మీ యాత్ర ప్రశాంతంగా జరుగుతుంది. అలాంటి వాళ్ల కోసమే ఈ కథనం.
మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాశీ వెళ్తున్న భక్తులు స్టే చేయడానికి అక్కడి సైకిల్ స్వామి ఆశ్రమానికి వెళ్లొచ్చు అక్కడ బడ్జెట్‌లో స్టే, ఫుడ్ లభిస్తుంది. ఒక్కరికి రూ. 300 నుంచి ఛార్జ్ చేస్తారట. ఇక తారక రామ ఆశ్రమంలో ఐతే ఒకరికి 150 రూపాయల నుంచి చార్జ్ చేస్తారట. ఇక్కడే మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ అల్పాహారం ఉంటుందట.
మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని, అక్కడ నుంచి వారాహి అమ్మ దర్శనానికి వెళ్ళండి. ఉదయం 9 గంటలలోపే వారాహి అమ్మ దర్శనం. ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు. వారాహి అమ్మ గ్రామ దేవత. అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగ్గరలోనే ఉంటుంది. అమ్మ దర్శనం చేసుకొని, విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి 2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు. 1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతినీ దర్శించుకోవచ్చు. డుంది గణపతి గుడి లోపల ఉంటుంది. స్వామి వారి దర్శనం 4 వ నంబర్ గేట్ నుంచి త్వరగా అవుతుంది. స్వామి దర్శనం చేసుకొని వచ్చాక లోపల అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూజారికి 100 ఇస్తే అమ్మ వారిని తాకనిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 వరకు స్వామి వారి స్పర్శ దర్శనం ఉంటుంది. 7 గంటలకు హారతి సేవ ఉంటుంది. స్వామి దర్శనం ఆది, సోమవారాలు బాగా రద్దీగా ఉంటుంది.
అన్నపూర్ణమ్మ గుడి లోపలి నుంచి అన్న ప్రసాదానికి దారి ఉంటుంది. కచ్చితంగా అక్కడ భోజనం చేయాలి. గుడిలో మనకి అమ్మ ప్రసాదంగా ఒకతను, కొంచెం బియ్యం, ఒక coin (కాసు) ఇస్తారు. 100 రూపాయలు ఇవమంటారు. 50 రూపాయలు ఇచ్చినా కొందరు తీసుకుంటారు. ఆ కాసు మన ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి. బియ్యం మన ఇంట్లో మనం తెచుక్కున్న బియ్యం బస్తాలలో కొంచెం వేసుకొని మిగతాది బీరువాలో దాచుకోవాలి.
స్వామి దర్శనం అయిపోయాక స్థానికంగా ఉన్న దుర్గమ్మ గుడి, గవ్వలమ్మ, మందిరం, బెనారుస్ యూనివర్సిటీలో టెంపుల్స్, హనుమాన్ టెంపుల్ అన్ని చూడొచ్చు. అందుకోసం ఆటో మాట్లాడుకోవాలి. మనిషికి రూ. 300 వరకు ఛార్జ్ చేస్తారట. అవి అన్నీ చూసుకునే సరికి సాయంత్రం 6 అవుతుంది. అక్కడ కు దగ్గర్లో ఉండే ఏదైనా ఘాట్ లలో గంగ హారతి చూసుకోవచ్చు. దశాశ్వమేధ ఘాట్, కేదార్నాథ్ ఘాట్ ఆశ్రమానికి దగ్గర్లోనే ఉంటాయి.
కాశీలో రెండవ రోజు 64 ఘాట్లలో స్నానాలు చేయడానికి పడవలు మాట్లాడుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణిక ఘాట్‌లో స్నానాలు చేస్తే పితృ దేవతలకి మోక్షం లభిస్తుంది అంటారు. స్నానం చేసే సమయంలో మనసులోని కోరికలు నెరవేరుతాయి అంటారు. మణికర్ణిక ఘాట్ విశ్వనాథ గుడి 4 వ నంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకి నడుస్తూ వెళ్తే కుడి చేతి వైపు పెద్ద అర్చ్ కనిపిస్తుంది. దానిలో నుంచి నడుచు కుంటు వెళ్తే ఘాట్ కి వెళ్తాం. దాదాపు ఘాట్లు అన్ని పక్క పక్కనే ఉంటాయి.
కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అక్కడి నుంచి వస్తుంటే.. మధ్యలో మహా మృత్యుంజయ గుడి, ఓంకారేశ్వర మకరేశ్వర్, ఆకరేశ్వర గుడులు చూడొచ్చు. అలాగే జంగం బాడీ మఠం దాటాక తిలబందేశ్వర్ గుడి ఉంటుంది. కుదిరితే లోలార్కు కుండ్ చూసుకోండి. హిందువులు అక్కడ ఎక్కువగా పుణ్య స్నానాలు ఆచరిస్తారు. సూర్య భగవానుడి చిన్న గుడులు అక్కడే ఉంటాయి.
గుడిలోకి దర్శనానికి వెళ్లినప్పుడు మీ ఫోన్స్, వాల్లెట్స్ అనుమతించరు. ఒకవేళ మర్చిపోయి తీసుకు వెళ్తే 4 వ నంబర్ గేట్ దగర దేవస్థానం వారి ఫ్రీ లాకర్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.