BigTV English

Hindu Ritual:- యాగాలు, యజ్ఞాలు వెనుక అసలు ఉద్దేశం ఇదే

Hindu Ritual:- యాగాలు, యజ్ఞాలు వెనుక అసలు ఉద్దేశం ఇదే

Hindu Ritual:- రుణ శేషం, శత్రు శేషం ఉండకూడదు అంటారు. హిందూమతం ప్రకారం ఈ జన్మలో ఎవరికైనా రుణపడితే, వచ్చే జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టి ఆ బాకీ తీర్చుకుంటామని పెద్దలు చెప్తుంటారు. బంధుమిత్రుల వద్ద డబ్బు అప్పుగా తీసుకోవడం అని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ మరొకరి వస్తువులు లేదా పదార్ధాలు తీసుకుని, తిరిగి ఇవ్వకున్నా అది కూడా బాకీపడటమే


అనుబంధాల రీత్యా కూడా రుణపడతాం. ఈ రుణానుబంధాల్లో మొదటిది దేవరుణం. జీవరాశుల్లో అన్నింటికన్నా ఉత్కృష్టమైంది మానవ జన్మ. ఎందుకంటే, మనిషికి మాత్రమే మనసు, మేధస్సు ఉన్నాయి. మరి ఇంత ఉన్నతమైన మానవజన్మను మనకు ప్రసాదించిన దేవుడికి తప్పకుండా రుణపడతాం. అందువల్ల దేవ రుణం తప్పకుండా తీర్చుకోవాలి.

దేవుడు మనకు కేవలం జన్మను మాత్రమే ఇవ్వలేదు. ప్రకృతిని ప్రసాదించాడు. జీవితంలో కావలసినవన్నీ ఇస్తున్నాడు. మన శరీర ప్రక్రియను మించిన అద్భుతమైన యంత్రం ఉందా? మరి ఈ అపురూపమైన మానవజన్మను సక్రమంగా వినియోగించుకుంటే సుఖం, శాంతి ఉంటుంది. మన పుట్టుక సార్ధకమౌతుంది.


దేవ రుణం తీర్చుకోవాలంటే సంపదలేం సమర్పించనవసరం లేదు. ఆరాధనతోనే రుణం తీర్చుకోవచ్చు. యజ్ఞ కర్మ వల్ల మానసిక శాంతి కలగడమే కాదు, వాతావరణ కాలుష్యం నివారణ అవుతుంది. యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి, స్వచ్చతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు.
యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. ఇతిహాసాలు, పురాణాల్లో అందుకే హోమాలు, యజ్ఞాల ప్రస్తావన కనిపిస్తుంది

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×