BigTV English

Puri Temple:- పూరీలో బ్రహ్మపదార్థాన్ని ఎవరూ చూడలేరా..?

Puri Temple:- పూరీలో బ్రహ్మపదార్థాన్ని ఎవరూ చూడలేరా..?

Puri Temple:- శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరమంతా ఐదు మూలకాలలో కలFపారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది.ఆయన గుండె ఈనాటి వరకూ సురక్షితంగా ఉంది. ఇది జగన్నాథుని చెక్క విగ్రహం లో ఉంది. అలా కొట్టుకుంటూనే ఉంది. పూరీజగన్నాథ్ ని కలియుగ ప్రభువు అని కూడా అంటారు. ప్రతి 12సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చుతూ ఉంటారు.


ఆ సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపేస్తారు. తరువాత సీఆర్పీఎఫ్ బలగాలు అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని రౌండప్ చేస్తుంది. ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు. ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది. పూజారి కళ్ళుకి గంతలు కట్టుకుని కట్టుకుంటారు… పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి.. పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్ధం తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు…

ఈ బ్రహ్మ పదార్ధం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు … ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు. .. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉందిది. ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు. కొంతమంది పూజారులు మేము చేతిలో తీసుకున్నప్పుడు ఆయన కుందేలు లాగా దూకుతున్న అనుభూతి కలిగిందని చెప్పారు. ఇప్పటికీ జగన్నాథ్ యాత్ర సందర్భంగా పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడుస్తాడు. చాలా దేవాలయాల శిఖరాలపైన పక్షులు కూర్చుని ఎగురుతూ ఉండడాన్ని మనం చూస్తూంటాం. కాని జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు.


జగన్నాథ్ ఆలయం యొక్క 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజూ మార్చడం జరుగుతుంది. జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. జెండాను ఏరోజైనా మార్చకపోతే ఆనాటినుండి ఆలయం 18 సంవత్సరాలపాటు మూసివేయాల్సి ఉంటుంది. ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన్ చక్రం ఏదిశ నుండి చూసినా అది మనకు ఎదురుగానే ఉన్నట్లు కనిపించడం ఒక విశేషమే. జగన్నాథ్ ఆలయ వంటగదిలో 7 మట్టి కుండలు ఒకదానిపైన ఒకటిఉంచి ప్రసాదాన్ని కట్టెలపొయ్యి మీదనే వండుతారు. ఇక్కడ ప్రతిరోజూ చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు. ఆశ్చర్యకరమైన విషయం … ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×