BigTV English

Marriage Muhurtham : ఈ ఏడాదిలో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు

Marriage Muhurtham : ఈ ఏడాదిలో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు
Marriage Muhurtham

Marriage Muhurtham : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 13 మాసాలు వచ్చాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇలా వస్తుంటుంది. సౌర, చంద్రమానం లెక్కల్లో తేడాల సవరణ వల్లే అధికమాసం వచ్చింది. సౌరమానం ప్రకారం ఏడాదికి 365 రోజుల 6 గంటలు. అదే చంద్రమానం ప్రకారమైతే ఏడాదికి 354 రోజులే ఉంటాయి. ఏడాది లెక్కింపులో ఉండే ఈ తేడాలను అధికమాసం రూపంలో సరిచేస్తుంటారు.


రెండు అమావాస్యల మధ్య రవి సంక్రమణం జరగని నెలను అధిక మాసంగా లెక్కిస్తారు. ఈ ఏడాది ఆషాఢ మాసంలో 17-7-2023 నాడు రాత్రి 12.01 గంటల వరకు అమావాస్య ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 5-06 గంటలకు రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాతి అమావాస్య వరకూ అదే రాశిలో ఉంటాడు. అందుకే ఈ ఏడాది శ్రావణం అధిక మాసంగా వస్తోంది. అ అధిక మాసంలో దానధర్మాలు ఎంత ఎక్కువ చేస్తే అంత విశేషమని పెద్దల మాట. శక్తి మేరకు ఈ నెలలో బీదసాదలకు దానం చేయడం ద్వారా అధిక ఫలితం పొందుతారు

అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా పరిగణిస్తారు. శ్రావణం అధిక మాసంగా వచ్చిన సంవత్సరంలో దుర్భిక్షం, భూముల ధరలు తగ్గడం, ప్రజాక్షయం, ప్రజలు భయకంపితులు కావడం, ప్రజల్లో పాపభీతి నశించడం, హింస పెరగడం, పాలకులు ప్రజావ్యతిరేక చట్టాలు చేయడం, ఆహార కొరత, ధరల పెరుగుదల వంటి ఫలితాలు కలుగుతాయి.


అధికమాసంలో చేయకూడని పనులు
నిత్యనైమిత్తిక కర్మలు, దానం, నిత్యాగ్ని హోత్రం, ఉపవాసం చేయవచ్చు. నామకరణ, అన్న ప్రాశనం,అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాది శుభకార్యాలు, పాలకుల ప్రమాణ స్వీకారాలు, నూతన అనుష్ఠానాలు, ఉత్సవాలు, దేవతా ప్రతిష్ఠ, సర్వ ప్రాయశ్చిత్తాలు, ఆశ్రమ స్వీకారం వంటివి ఈ మాసంలో చేయకూడదని పంచాంగం చెబుతోంది.

ఈరెండు మాసాలు తప్పితే మిగిలిన ఈ ఏడాదంతా పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు ఉన్నాయి.అధిక సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో కల్యాణ నామ సంవత్సరంగా ఈ ఏడాదిని చెప్పవచ్చు. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. ఏడాదంతా భాజాభంత్రిల మోత మోగనున్నాయి. ఈ ఏడాదిపెళ్లితో వేలాది జంటలు ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×