BigTV English
Advertisement

Tirumala Sri Balaji Idol :- తిరుమల శ్రీవారి విగ్రహం వెనుక దాగి ఉన్న రహస్యం

Tirumala Sri Balaji Idol :- తిరుమల శ్రీవారి విగ్రహం వెనుక దాగి ఉన్న రహస్యం


Tirumala Sri Balaji Idol :- ఏడు కొండలపై వెలసిన తిరుమలేశుడి దర్శనం పూర్వ జన్మసుకృతంగా భావిస్తుంటారు. మనం తిరుమలకు వెళ్లాలనుకుంటే వెళ్లలేం. ఆయన ఆశీర్వాదం ఉండి పిలుపు వస్తేనే వెళ్లగలం. చేతిలో డబ్బులు ఉన్నా, వెళ్లడానికి సొంత వాహనాలు ఉన్నా…ఆయన అనుమతి లేకుండా తిరుమలలో అడుగుపెట్టలేం.అంతటి మహిమ ఉన్న క్షేత్రం తిరుమల. వెంకటేశ్వరుని నిలువెత్తు విగ్రహం చూడటానికి రెండూ కళ్లు సరిపోవు. మరి అలాంటి శ్రీవారికి సేవలు చేస్తున్న అర్చకులు ఎంత అదృష్టవంతులో.. మిగిలిన భక్తులకి తెలియని ఎన్నో విషయాలు వారు ప్రతీ నిత్యం గమనిస్తుంటారు. దాదాపు మూడువేల అడుగులపైగా ఎత్తు ఉండే తిరుమలలో శ్రీవారి మూల విరాట్టు ఎప్పుడూ వేడిగా ఉంటుందట. తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీళ్లు, సుగంధద్రవ్యాలు, పాలతో ఆ వెంకటేశ్వరుడి నిత్యం అభిషేకం కూడా చేస్తారు. పట్టు పీతాంబర వస్త్రాలతో మూలవిరాట్టును సుతిమెత్తగా శుభ్రం చేస్తుంటారు. అయినా సరే స్వామి వారి మూల విరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆస్వామి ఉంటారని స్వామి చేస్తున్న అర్చక స్వాములు చెబుతుంటారు…ఎప్పుడూ చల్లటి వాతావరణంలో ఉండే శ్రీవారి మూలవిరాటులో అంతటి వేడి కనిపించడం స్వామి వారి మహత్యమే. వాస్తవానికి శ్రీవారి మూలవిరాట్టు మాములు రాయి అయితే చల్లగా ఉండాలి. తిరుమలేశుడు ఎవరో తీసుకొచ్చిన విగ్రహం కూడా కాదు. కలియుగాన భక్తుల్ని కాపాడేందుకు శ్రీమన్నారాయుడు దిగొచ్చిన దేవుడుగా భక్తుల ప్రగాడ విశ్వాసం. అలాంటి స్వామి వారి మూలవిరాట్టు నిత్యం 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండటం విశేషమే.నిత్యం ప్రతి గురువారం అభిషేకానికి ముందు, వెంకన్న ఆభరణాలను తీసి విగ్రహాన్ని తుడుస్తారు. ఆ సమయంలో కూడా ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు నుంచి ఉద్భవిస్తున్న ఉష్ణోగ్రత వల్లే ఆభరణాలు వేడిగా ఉంటాయని చెబుతున్నారు.


Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×