BigTV English
Advertisement

Shani Jayanti 2024: నేడు శని దేవుడి జయంతి.. ఇలా చేస్తే మీకు పట్టిన శని ఇట్టే వదిలిపోతుంది!

Shani Jayanti 2024: నేడు శని దేవుడి జయంతి.. ఇలా చేస్తే మీకు పట్టిన శని ఇట్టే వదిలిపోతుంది!

Shani Jayanti 2024: నేడు కర్మ ఫలితాలను బట్టి అందరికీ ఫలాలను ఇచ్చే శనిదేవుడి జయంతిని జరుపుకుంటారు. జ్యేష్టమాసంలోని అమావాస్య రోజున ప్రతీ ఏడాది శనిదేవుడి జయంతిని జరుపుకుంటారని శాస్త్రం చెబుతుంది. ఎవరైతే శని దేవుడి ఆగ్రహంతో ఇబ్బందులు ఎదుర్కునే వారు ఉంటారో వారికి ఈరోజు చాలా ప్రత్యేకమైనది. నేడు శనిదేవుడికి చేసే పూజల కారణంగా శని దోషం తొలగిపోయి, శని దేవుడు వారిని అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే శని జయంతి రోజున శని దేవుడికి చేయాల్సిన పూజలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


శని దేవుడి పూజా విధానం..

శని దేవుడిని పూజించే క్రమంలో భక్తి, శ్రద్ధలతో సరైన నియమాలు పాటించాలి. ఉదయాన్నే తలంటూ స్నానం చేసి శనిదేవుడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. అనంతరం శని దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఈ తరుణంలో శని దేవుడికి ఇష్టమైన నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నువ్వులనూనెను సమర్పించిన అనంతరం నల్లగుడ్డను శనిదేవుడి విగ్రహానికి చుట్టి, బంతిపూలతో పూజించాలి. ఇలా నిష్టతో శనిదేవుడిని పూజించడం వల్ల శని సడేసతి నుంచి విముక్తి కలుగుతుంది.

Also Read: Nirjala Ekadashi 2024: నిర్జల ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలో తెలుసా..?


శని పూజలో భాగంగా 108 సార్లు శని దేవుడి మంత్రాన్ని జపించాలి. ఓం ప్రాణ్‌ ప్రీం ప్రాణ్‌ సః శనైశ్చరాయనమః అనే మంత్రాన్ని జపిస్తూ శని దేవుడి విగ్రహం చుట్టూ(నవగ్రహాలు) ప్రదక్షిణలు చేయాలి. అంతేకాదు శనిదేవుడికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి పూజను పూర్తి చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం పొందగలుగుతారు.

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×