BigTV English

Xiaomi Mix Flip: బ్రాండెడ్ కంపెనీ నుంచి తొలి Flip ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు ఇవే..!

Xiaomi Mix Flip: బ్రాండెడ్ కంపెనీ నుంచి తొలి Flip ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు ఇవే..!

Xiaomi Mix Flip Price And Launch date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. రకరకాల వేరియంట్లలో టెక్నాలజీ పరంగా.. మార్పులు తీసుకొచ్చి అందరిని అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఇప్పటికే ఎన్నో మోడల్స్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసిన షియోమి తనకంటూ మంచి గుర్తింపు.. క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు మరొక అడుగుముందుకేసింది. ఇందులో భాగంగానే ఇతర బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ల కంపెనీలకు పోటీగా తొలి ఫ్లిప్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.


ఇందులో భాగంగానే షియోమీ కంపెనీ ‘Xiaomi Mix Flip’ పేరుతో తొలి క్లామ్ షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే కంపెనీ దీనిని అధికారికంగా వెల్లడించనప్పటికీ గ్లోబల్ మార్కెట్‌లో పలు వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన లుక్, డిజైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించిన కొన్ని వివరాలు బయటకొచ్చాయి.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ 2405CPX3DG గల మోడల్ నెంబర్‌తో రానున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ గుర్తించారు. అయితే ఈ మిక్స్ ఫ్లిప్ మోడల్ నెంబర్‌లోని ‘జి’ అనేది గ్లోబల్ అని తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, మోటోరోలా రేజర్ 40, ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ లైనప్ నిలువు డిస్‌ప్లేతో మరిన్ని ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పబడింది.


Also Read: 50 MP కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో షియోమి న్యూ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

ఈ ఫ్లిప్‌ మొబైల్ భారతదేశం, జపాన్ మినహా గ్లోబల్ మార్కెట్లలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇక దీని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. షియోమి మిక్స్ ఫ్లిప్ ఫోన్ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది 1.5కె రిజల్యూషన్ డిస్‌ప్లే, 4900ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3ఎస్‌ఓసీ ద్వారా ఈ ఫోన్ శక్తిని పొందుతుంది. 50 MP OV50E ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 60 MP OV60A సెకండరీ సెన్సార్‌ డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. అలాగే సెల్ఫీ, వీడియోల కోసం 30MP ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ భారత కరెన్సీ ప్రకారం.. దాదాపు రూ.69000 ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×