E-Paper
Advertisement

Rahul Gandhi choose: రాహుల్ ఎటు వైపు మొగ్గు? సర్వత్రా ఆసక్తి..

Rahul Gandhi choose: రాహుల్ ఎటు వైపు మొగ్గు? సర్వత్రా ఆసక్తి..
Advertisement

Rahul Gandhi latest news(Political news telugu): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి కొత్త సమస్య ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచారు. ఒకటి కేరళలోని వయనాడ్, మరొకటి ఫ్యామిలీకి కంచుకోట ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం. ఈ రెండింటిలో ఆయన ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. తనను రెండుసార్లు ఆదరించిన వయనాడ్‌ను వదిలేస్తారా? లేక ఫ్యామిలీకి కంచుకోట రాయ్‌బరేలి సీటుకు రాజీనామా చేస్తారా? ఇవే ప్రశ్నలు కాంగ్రెస్ నేతలను వెంటాడు తున్నాయి.

చాలావరకు రాహుల్‌గాంధీ కేరళ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాత్రమే గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారాయన. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వారిటో రెండు ఎస్టీ, మరొకటి ఎస్సీ స్థానం. వయనాడ్‌లో క్రైస్తవ, ముస్లిం వర్గాల ఓట్లు ఎక్కువ. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ బలంగా ఉంది. ఇక్కడి నుంచి అయితే సౌత్‌లో పార్టీకి ఊపు వస్తుందని అంటున్నారు.

Advertisement

2019 ఎన్నికల్లో అమేథి నుంచి ఓటమి పాలయ్యారు రాహుల్ గాంధీ. ఈసారి అక్కడి నుంచి కిశోరీ‌లాల్ శర్మ బరిలోకి దిగడం, విజయం సాధించడం జరిగిపోయింది. సోనియా ఫ్యామిలీకి రాయ్‌బరేలీ కంచుకోట కావడంతో అక్కడి నుంచి ప్రియాంకను బరిలోకి దించుతారా? అన్న ప్రశ్న రైజ్ అవుతోంది.

ALSO READ: బీజేపీకి భారీ షాక్.. బిగ్ ఆఫర్ ప్రకటించిన ఖర్గే

Advertisement

గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాంరమేష్ ఓ విషయాన్ని ప్రస్తావించారు. ప్రియాంక దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం ఆమె పోటీ చేయరని అన్నారు. ఎక్కడైనా బైపోల్ వస్తే ప్రియాంక పోటీ చేసే ఛాన్స్ ఉందని ఒకానొక సందర్భంలో చెప్పారు. ఈ లెక్కన ఆమె బరిలోకి దిగడం ఖాయమని అంటున్నారు. మరోవారం ఆగితే దీనిపై క్లారిటీ రావడం ఖాయమని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు.

Tags

Related News

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

Big Stories

Advertisement
×