BigTV English

Rahu Transit 2024: భాద్రపద నక్షత్రంలో శని.. రాహు సంచారం.. ఈ రాశుల వారికి జూలై 8 నుంచి కష్టాలు..!

Rahu Transit 2024: భాద్రపద నక్షత్రంలో శని.. రాహు సంచారం.. ఈ రాశుల వారికి జూలై 8 నుంచి కష్టాలు..!

Rahu Transit 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు యొక్క ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. జూలై 8 సోమవారం సాయంత్రం నుంచి శని భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. రాహు రాశిలో శని సంచరించడం వల్ల రాహువు ప్రభావం పలు రాశులపై పడనుంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేసినప్పటికీ ముఖ్యంగా మూడు రాశులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


రాహువు మేధస్సు, మెదడు ఆలోచనలను ప్రభావితం చేసే గ్రహం. ఈ గ్రహం వ్యక్తిగత విషయాలపై ఆధిపత్యం చెలాయించినప్పుడు రాహువు పాప గ్రహంగా పరిగణిస్తారు. రాహువు రాశులపై ప్రభావం చూపినప్పుడు వారిలో మొండితనం దుష్టత్వం, ఆలోచనలో అస్థిరత్వం, సోమరితనం, పేదరికం, ఆటంకం, అడ్డంకులు, అబద్ధాలు, జూదం, సమాజం నుంచి బహిష్కరణ, దొంగతనం, నీచత్వం వంటివి కలుగుతాయి.

కర్కాటక రాశి:
భాద్రపద నక్షత్రంలో రాహు సంచారం కర్కాటక రాశిపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీ మనసు చంచలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆలోచనలో స్థిరత్వం, అస్థిరత కలుగుతుంది. జీవితంలో సోమరితనం చాలా వరకు పెరుగుతుంది. మీరు చేసే పనులపై రాహువు ప్రభావం చూపిస్తాడు. తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ధన ప్రవాహం తగ్గిపోవచ్చు. వ్యాపారంలో కూడా భారీగా నష్టపోయే అవకాశాలున్నాయి. విద్యార్థుల కెరీర్‌లో పురోగతి కూడా ఆగిపోవచ్చు. మంచి ఇన్స్టిట్యూట్‌లో ప్రవేశానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో పాటు కుటుంబ జీవితంలో కూడా విభేదాలు ఏర్పడతాయి.


Also Read: 46 రోజుల పాటు 6 రాశుల వారికి అడుగడుగునా అదృష్టమే..

సింహ రాశి:
భాద్రపదంలో రాహు సంచారం సింహ రాశి వారి జీవితంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీ మానసిక బలహీనత పెరుగుతుంది. పనులు కష్టపడి చేయాలని మీకు అనిపించినప్పటికీ మీరు చేయాలి అనుకున్న పనులు నిలిచిపోతాయి. వ్యాపారస్తుల మధ్య ఉన్న ఒప్పందాలు విచ్ఛిన్నమవుతాయి. ఆర్థిక సంక్షోభం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పనిలో ఆటంకం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో నష్టాలు భారీగా పెరుగుతాయి. చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతంది. పిల్లలు బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

కన్యా రాశి:
రాహువు కన్యా రాశిలోకి ప్రవేశించడం వీరికి వినాశాన్ని కలిగిస్తుంది. జీవితంలో తీవ్రమైన ప్రతికూల మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీర్తి. స్థానం, సామాజిక స్థితి క్షీణిస్తుంది. మీపై ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆఫీసు వాతావరణం మీకు ప్రతికూలంగా ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు, తగాదాలు జరుగుతాయి. వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. వ్యక్తిగత సంబంధాలతో ఇబ్బందులు పెరుగుతాయి. జీవితంలో కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయి.

Tags

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×