Happy Ugadi 2026: వసంత కాలం మొదలైపోయింది.. వేపపువ్వు పూత, కోయిలమ్మ కూతలలో ప్రకృతి కొత్త పెళ్లికూతురిలా ముస్తాబవుతుంది. నిజానికి ఉగాది అంటే.. కేవలం క్యాలెండర్ మారడం కాదు.. పాత చేదు జ్ఞాపకాలను విడిచి, కొత్త ఆశలతో ముందడుగు వేయడం. అలాగే ఉగాదికి షడ్రుచుల పచ్చడి, పంచాంగ శ్రవణంతో మన తెలుగు ఇళ్లలో మొదలయ్యే ఆ సందడి మాటల్లో చెప్పలేనిది.
అయితే, నేటి బిజీ లైఫ్‌లో అందరినీ కలిసి పలకరించడం కుదరకపోవచ్చు. కానీ, ఒక చిన్న మెసేజ్‌తో మనసులోని ప్రేమను పంచుకోవడం కూడా అందమైన సంప్రదాయమే కదా. అందుకే, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పండుగ శుభాకాంక్షలు తెలపడానికి కొన్ని హృదయపూర్వక కొటేషన్లు, వాట్సాప్ స్టేటస్‌లు ఇక్కడ ఉన్నాయి. మీ ప్రియమైన వారి కోసం వీటిలో ఒకదాన్ని ఎంచుకుని పంపేయండి ఫ్రెండ్స్.
1. ఈ ఉగాది మీ జీవితంలో తీపి జ్ఞాపకాలను, కొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు!
2. జీవితం షడ్రుచుల సమ్మేళనం.. కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఈ ఏడాది సుఖసంతోషాలతో గడపాలని ఆశిస్తూ.. హ్యాపీ ఉగాది!
3. కొత్త ఆశలు, కొత్త ఆశయాలతో ఈ నూతన సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి.
4. వేపపువ్వు చేదు, మామిడి వగరు.. మీ జీవితంలోని బాధలను పోగొట్టి విజయాలను అందించాలి.
5. మీకు, మీ కుటుంబ సభ్యులకు ‘పరాభవ’ నామ సంవత్సర శుభాకాంక్షలు!
6. ప్రకృతి వికసించినట్లుగా మీ కలలన్నీ ఈ ఏడాది నిజం కావాలని కోరుకుంటూ.. హ్యాపీ ఉగాది!
7. మీ చిరునవ్వు ఈ ఏడాదంతా ఇలాగే వెలిగిపోవాలని కోరుకుంటూ.. హ్యాపీ ఉగాది!
8. ఐశ్వర్యం, ఆరోగ్యం మీ ఇంట కొలువుండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
9. ఈ ఉగాది పచ్చడి లాగే నీమీ జీవితం కూడా అన్ని అనుభూతులతో నిండిపోవాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు!
10. మన స్నేహం ఇలాగే చిరకాలం పచ్చగా ఉండాలని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు మిత్రమా!
11. ఈ కొత్త ఏడాదిలో మీ లక్ష్యాలన్నీ చేరుకోవాలని కాలం తెచ్చే మార్పు మీ జీవితంలో గొప్ప మలుపు కావాలని కోరుకుంటున్నా.
12. ఈ కొత్త తెలుగు సంవత్సరాది కావాలి అందరికీ వెలుగు నింపే సూర్యావళి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు!
13. మీకు ఆయురారోగ్య సౌఖ్యాలు ప్రసాదించాని కోరుకుంటూ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
14. ఈ ఉగాది మీకు ఆయుష్షు, ఆరోగ్యం, సంపద, ఆనందం అందించాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది!
15. మీ జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోయి, తీపి కబుర్లు మీ దరి చేరాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది!