E-Paper
Advertisement

Tadipatri suicide: 20 రోజుల క్రితమే వివాహం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని నవవధువు ఆత్మహత్య

Tadipatri suicide: 20 రోజుల క్రితమే వివాహం.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని నవవధువు ఆత్మహత్య
Advertisement

Tadipatri suicide: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన 20 రోజులకే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. గన్నవారిపల్లి కాలనీలో నివసించే లక్ష్మీప్రసన్న అనే యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

లక్ష్మీప్రసన్న తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుగా విధులు నిర్వహిస్తోంది. గత నెలలోనే ఈమెకు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన విజయ్ అనే యువకుడితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె పుట్టింటికి రాగా తిరిగి అత్తగారింటికి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆమె మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అత్తగారింటికి వెళ్లాల్సిన సమయంలో ఈ ఘోర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చేతికి ఉన్న గోరింటాకు ఇంకా ఆరకముందే నవవధువు ఇలా విగతజీవిగా మారడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: జగిత్యాలలో ఏసీబీ పంజా.. సీఐ, టీచర్ కలిసి చేసిన దందా మామూలుగా లేదుగా!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×