E-Paper
Advertisement

Saturn Transit: శని ప్రభావం.. వీరి తలరాతలు మారిపోయే టైం వచ్చేసింది.

Saturn Transit: శని ప్రభావం.. వీరి తలరాతలు మారిపోయే టైం వచ్చేసింది.
Advertisement

Saturn Transit: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని తిరోగమనంలో జరిగే మార్పు చాలా ముఖ్యమైంది. న్యాయ దేవుడిగా భావించే శని తన రాశిని మార్చుకున్నప్పుడు లేదా తిరోగమన దిశలో సంచరిస్తున్నపుడు అది మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది. శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఈ ఏడాది మొత్తం శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలోనే సంచరిస్తాడు.

నవంబర్ 15వ తేదీ వరకు తిరోగమన స్థితిలోనే శని ఉండడంతో పాటు అక్టోబర్ నెలలో తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. దృక్ పంచాంగం ప్రకారం అక్టోబర్ 3వ తేదీన గురువారం మధ్యాహ్నం 12:10 గంటలకు శని పూర్వాభాద్ర నక్షత్రాన్ని వదిలి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాలను చూపిస్తుంది. శతభిషా నక్షత్రానికి రాహువు అధిపతిగా చెబుతారు. జ్యోతిష్య లెక్కల ప్రకారం రాహువు అక్టోబర్‌లో నక్షత్ర మార్పు చెందడం వల్ల కొన్ని రాశులకు ప్రయోజనం ఉంటుంది. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
శని నక్షత్ర మార్పు మేష రాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. మనస్సు ఆనందంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మతపరమైన కార్యక్రమాలపై ఏకాగ్రత వహిస్తారు. ఆధ్యాత్మికత చాలా పెరుగుతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విజయాన్ని సాధిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీ జీవితంలో అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
వృషభ రాశి:
శని శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే వృషభరాశి వారికి మంచి రోజు ప్రారంభం అవుతాయి. ఉద్యోగులు ప్రతి పనిలో అఖండ విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే వారికి మంచి అవకాశం వస్తుంది. సామాజిక హోదా, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కెరీర్లో సానుకూల మార్పులు ఉంటాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమమవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు వస్తాయి. వివాహ జీవితంలోని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

Advertisement

Also Read: హస్తా నక్షత్రంలోకి కేతువు.. 63 రోజులు ఈ రాశుల వారికి అన్నీ లాభాలే

ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి శని నక్షత్రం మారడం వల్ల విపరీతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా వేతన పెంపుకు అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. అనేక వైపుల నుంచి ధనం వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌లు కూడా వస్తాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×