E-Paper
Advertisement

Vastu for Buying Plots : ఉత్తర , ఈశాన్యంలో ఉన్న స్థలాన్ని అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే…

Vastu for Buying Plots : ఉత్తర , ఈశాన్యంలో ఉన్న స్థలాన్ని అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే…
Advertisement

Vastu for Buying Plots : స్థలం కొనేటప్పుడు వాస్తు పాటించకపోతే లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. తక్కువ రేటుకు వస్తుంది కదా ఏది పడితే అది కొనకూడదు. ఇంటికే కాదు స్థలానికి వాస్తు వర్తిస్తుంది. ఇల్లు కట్టాలంటే స్థలంలో వాస్తు ఉండాలి.కొనుగోలు చేసే స్థలం బల్లపరుపుగా, చదునుగా ఉండాలి. స్థలానికి పడమర దిశలో కాని, దక్షిణ దిశలో గాని పెద్దపెద్ద గోతులు, కాలువలు ఉండకూడదు. పడమర దక్షిణ దిశలలో స్థలం ఎత్తుగా ఉండొచ్చు. పడమర , దక్షిణ దిశలో ఎత్తైన కొండలు, గుట్టలు ఏవి ఉన్నా అటువంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చు.

దక్షిణ నైరుతి, పశ్చిమభాగాల్లో బావులు, గుంతలు, పల్లం లేకుండా చూసుకోవాలి.
ఉత్తర, ఈశాన్య, తూర్పు భాగంలో బావులు, గుంతలు, పెద్ద కాలువలు, పల్లమున్న స్థలాలు అస్సలు వదులుకోవద్దు. ఈశాన్య వీధిపోటు ఉన్న స్థలం కూడా కలిసి వస్తుంది.కొనుగోలు చేసే స్థలంలో ఈశాన్య దిక్కు పల్లంగా ఉంటే అది ఎంతో ఉత్తమం. ఈశాన్య దిక్కు కన్నా మిగతా మూలాలు పల్లంగా ఉండకూడదు అనేది వాస్తు నియమం.

Advertisement

స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు స్థలానికి అతి చేరువలో స్మశానాలు, కర్మాగారాలు, అధిక ధ్వనిని కలిగించే రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లు, విమానాశ్రయాలు వంటివి లేకుండా జాగ్రత్త పడాలి. మనం నివసించే స్థలానికి దగ్గర ఇవి ఉంటే ధ్వని కాలుష్యం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇక అంతే కాదు స్థలానికి అతి దగ్గరలో మురుగు కాలువలు లేకుండా చూసుకోవాలి. స్థలం కొనుగోలు చేసేటప్పుడు అక్కడ పాముల పుట్టలు కనిపించినా, మట్టి దిబ్బలు కనిపించిన, ఎముకలు, దంతాలు వంటివి కనిపించినా నివాసయోగ్యం కాదని వదిలివేయాలి.

ఈశాన్యం పెరిగిన స్థలాన్ని వెంటనే కొనేయండి..అగ్నేయం పెరిగిన స్థలం ఎలాంటి పరిస్థితుల్లోను కొనకూడదు. దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలాన్ని కొనొచ్చు.ఉత్తరం దక్షిణం కన్నా మెరకగా ఉండకూడదు. తూర్పు పడమర కన్నా మెరకగా ఉండకూడదు. స్థలానికి ఎదురుగా వీధిపోటు కానీ వీధిశూల కానీ ఉండకూడదు. స్థలం రోడ్డు కంటే దిగువకు ఉండకూడదు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×