BigTV English

Tulsi Hair Oil : తులసి ఆకులతో ఇలా చేస్తే జుట్టును కాపాడుకోవచ్చు

Tulsi Hair Oil : తులసి ఆకులతో ఇలా చేస్తే జుట్టును కాపాడుకోవచ్చు

Tulsi Hair Oil : జుట్టు రాలడం.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఇది. ఆహార లోపం, వాతావరణంలో కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టును కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల షాంపూలు, కండిషనర్లు వాడుతుంటారు. అయినా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. మన పెరట్లో దొరికే తులసి మొక్క ఆకులతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోవడం ఏడాది పొడవునా కనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వానాకాలంలో ఎక్కువగా రాలుతుంటుంది. చుండ్రు, హార్మోన్ స్థాయిల్లో మార్పుల కారణంగా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తులసి ఆకులను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. పవిత్రమైన మొక్కగా భావించే ఈ తులసి ఆకుల్లో వివిధ యాంటీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. చర్మ ఆరోగ్యం, జుట్టు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని తులసి ఆకులను తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. మెత్తగా రుబ్బుకొని పేస్టుగా మార్చుకోవాలి. దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను వెంట్రుకలకు పట్టించి కొద్దిసేపు అలాగే ఉంచాలి. పేస్ట్ ఆరిపోయిన తర్వాత ఒక తేలికపాటి షాంపూను వాడి తలను బాగా కడగాలి. వారానికి ఒకసారి ఈ పేస్ట్ రాసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కాకపోతే ఈ నూనె ఎంపిక విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తులసి ఆకుల నుంచి తీసిన నూనెను జుట్టుకు పట్టించడం వల్ల రాలిపోకుండా చూసుకోవచ్చు. వారంలో రెండు మూడుసార్లు తులసి ఆకులతో చేసిన నూనెతో బాగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై జుట్టు రాలకుండా ఉంటుంది. వెంట్రుకలు కూడా తెలుపు రంగులోకి మారకుండా ఉంటాయి. ఉసిరి పొడి, తులసి పొడి కలిపి రాత్రంతా నానబెట్టి ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తలకు పట్టించాలి. అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సాధారణంగా జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు. ఈ సమస్య నుంచి బయటపడడానికి పెరుగులో తులసి ఆకుల రసాన్ని కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత తలకు పట్టించాలి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. వెంట్రుకలు కూడా రాలకుండా ఉంటాయి. గోరింటాకు పొడి మహిళల అరచేతులను ఎర్రబడేటట్లు చేయడమే కాకుండా జుట్టుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకులను కోరింటాకుతో కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా వెంట్రుకలు రాలకుండా చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వారంలో ఒకసారి పెట్టుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా జుట్టుకు మెరుపులు కూడా తీసుకొస్తుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×