G2 Release Date Announced: యంగ్ హీరో అడవి శేష్ నటించిన గుఢచారి మూవీ మంచి విజయం సాధించింది. 2018లో అడవి శేష్ హీరోగా శోభితా దూళిపాళ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మోత మోగించింది. కేవలం రూ. 6 కోట్లతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 30 కోట్లు గ్రాస్, రూ. 10 కోట్ల గ్రాస్ చేసింది. శశి కిరణ్ టిక్క ఈ చిత్రంలోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించి ప్రతిఒక్కరి ప్రశంసలు అందుకున్నాడు.
గుఢచారి సూపర్ హిట్
తొలి ప్రయత్నంలోనే అతడు సక్సెస్ అయ్యాడంటూ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దీనిక సీక్వెల్ కూడా ప్రకటించారు. అయితే చాలా ఆలస్యంగా గుఢచారి సీక్వెల్ను ప్రకటించారు. గతేడాది గుఢచారి 2ని ప్రకటించి పూజ కార్యక్రమానికి కూడా జరిపించారు. అయితే షూటింగ్పై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. అసలు గుఢచారి షూటింగ్ అవుతందా? లేదా? అనే ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాను పక్కన పెట్టి అడవి శేష్ డెకాయిట్ మూవీని ప్రకటించి షూటింగ్ని చకచక పూర్తి చేస్తున్నాడు.
దీంతో గుఢచారి 2 ఉందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వాటన్నింటికి చెక్ పెడుతూ తాజాగా జి2(G2) సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది 2026 మే 1న విడుదల చేస్తున్నట్టు మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. అంతేకాదు ఇందులో హీరోయిన్ ఎవరనేది కూడా నేరుగా లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. బాలీవుడ్ భామ వామిక గబ్బర్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నట్టు ఈ పోస్టర్తో వెల్లడించారు. జీ2 మూవీ విడుదల తేదీ ప్రకటన అడవి శేష్ ఫ్యాన్స్ అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విలన్ గా బాలీవుడ్ హీరో..
కాగా ఈ సినిమాలో విలన్గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. G2 రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ మూవీ నుంచి మూడు పోస్టర్స్ విడుదల చేశారు. ఓ పోస్టర్లో అడవి శేష్, హీరోయిన్ వామిక గబ్బర్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో అడవి శేష్ గన్‌తో రా ఎజెంట్లో లుక్లో ఆకట్టుకోగా.. హీరోయిన్ వామిక అల్ట్రా స్టైలిష్ లుక్ ఫిదా చేసింది. మరో పోస్టర్లో హీరో, విలన్ చూపించారు. రెడ్ థీమ్ బ్యాక్‌డ్రాప్‌లో అడవి వేష్, ఇమ్రాన్లు సీరియస్ లుక్లో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్టర్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఎట్టకేలకు జీ2పై అప్‌డేట్ రావడంతో మూవీ ఫ్యాన్స్ అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అడవి శేష్ డెకాయిట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఇక జీ2 షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.
Get ready to watch the Biggest Indian Action Spy Thriller in theatres ❤🔥#G2 – shot across 6 countries, 23 sets and over 150 days 🌍
WORLDWIDE RELEASE ON MAY 1st, 2026 💣💥
In Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#Goodachari2@AdiviSesh @iWamiqaGabbi @emraanhashmi… pic.twitter.com/yukmGUyw22— People Media Factory (@peoplemediafcy) August 4, 2025