BigTV English
Advertisement

Sravana Masam 2025: శ్రావణ మాసంలో చివరి సోమవారం ఈ పూజ చేస్తే.. సకల సంపదలు

Sravana Masam 2025: శ్రావణ మాసంలో చివరి సోమవారం ఈ పూజ చేస్తే.. సకల సంపదలు

Sravana Masam 2025: శ్రావణ మాసం అంటేనే శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివారాధనకు ఎంతో విశిష్టమైంది. అయితే.. శ్రావణ మాసంలో చివరి సోమవారం మరింత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తే సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


శ్రావణ మాసంలో చివరి సోమవారం ప్రాముఖ్యత:

శ్రావణ మాసంలో శివుడు కాలాకూట విషాన్ని మింగి లోకాన్ని కాపాడాడు. అందుకే ఈ మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా సోమవారం శివుడికి ఇష్టమైన రోజు. శ్రావణంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. చివరి సోమవారం రోజున ఈ పూజలు చేయడం వల్ల నెలంతా పూజల ఫలితం లభిస్తుందని నమ్మకం. ఈ రోజున చేసే శివారాధన వలన అదృష్టం, ఆరోగ్యం, ధన లాభం కలుగుతాయని పండితులు చెబుతున్నారు.


పూజా విధానం:
1. ఉపవాసం, శుద్ధి:
ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. రోజు మొత్తం ఉపవాసం ఉండి, శివనామస్మరణ చేయాలి. ఈ రోజున ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవడం మంచిది.

2. శివలింగానికి అభిషేకం:
శివాలయానికి వెళ్లి అభిషేకం చేయాలి. అభిషేకానికి గంగాజలం, ఆవు పాలు, పెరుగు, తేనె, చెరకు రసం, పంచామృతాలు, బిల్వ పత్రాలు, మందార పూలు, విభూతి వంటివి ఉపయోగించాలి. ఈ అభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది.

3. మంత్ర పఠనం:
అభిషేకం చేసేటప్పుడు పూజ సమయంలో “ఓం నమః శివాయ” లేదా “మహా మృత్యుంజయ మంత్రం” పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది గ్రహ దోషాలను కూడా తొలగిస్తుందని నమ్మకం.

4. నైవేద్యం సమర్పణ:
గోధుమ పిండి, పంచదార, నెయ్యితో చేసిన స్వీట్లు, సగ్గుబియ్యం పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.

ఫలితాలు:
శ్రావణ మాసంలో చివరి సోమవారం ఈ విధంగా పూజలు చేస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి: శివుడి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగి, సిరి సంపదలు పెరుగుతాయి.

Also Read: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేస్తే.. సోదరులకు శుభం జరుగుతుందో తెలుసా ?

ఆరోగ్యం మెరుగుపడుతుంది: ఆరోగ్య సమస్యలు దూరమై, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి.

కోరికలు నెరవేరతాయి: మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయి. వివాహానికి ఆటంకాలు తొలగి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.

పాపాలు తొలగిపోతాయి: జన్మ జన్మల పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుంది.

శ్రావణ మాసం చివరి సోమవారం రోజున దానం చేయడం కూడా చాలా మంచిది. పేదలకు, సాదువులకు అన్నం, బట్టలు దానం చేయడం వల్ల శివుడు మరింత ప్రసన్నుడై ఆశీర్వదిస్తాడు.

 

 

 

Related News

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Karthika Pournami 2025: 365 వత్తుల దీపం.. వెనక దాగి ఉన్న అంతరార్థం ఏంటి ?

Life of Radha: కృష్ణుడిని ప్రేమించిన రాధ చివరకు ఏమైంది? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది?

Big Stories

×