Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలతో పాటు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే తాజాగా ఈయన తన కోడలు ఉపాసన(Upasana) గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే అపోలో హాస్పిటల్ బాధ్యతలతో పాటు, ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్న ఉపాసన మరో గౌరవాన్ని అందుకున్నారు.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా ఉపాసన…
తాజాగా ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పజెప్పింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ (Telangana Sports Hub)కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ను నియమించింది. ఈ బోర్డుకు లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకాను ఛైర్మన్‌గా నియమించారు. కో-ఛైర్మన్‌గా(Co Chairperson) ఉపాసన కొణిదెలకు అవకాశం కల్పించారు. ఇలా ఉపాసన స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చాలా గర్వంగా ఉంది…
ఈ క్రమంలోనే తన కోడలికి కీలకమైన బాధ్యతలు అప్ప చెప్పడంతో చిరంజీవి అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ ఉపవాసన పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ.. “మా కోడలు ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్ పర్సన్.. గౌరవనీయమైన పదవికి ఉపాసన ఎంపిక కావడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఇది గొప్ప బాధ్యతతో పాటు ఎంతో గౌరవమైన పదవి కూడా అంటూ” చిరంజీవి తెలియజేశారు.” ప్రియమైన ఉపాసన నీ నిబద్ధత అలాగే మీ అభిరుచితో, అపారమైన క్రీడా ప్రతిభను పెంపొందించడానికి, వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే విధివిధానాలను రూపొందించడానికి ఎంతగానో దోహదపడతారని నేను భావిస్తున్నాను. అందుకు ఆ దేవుడు ఆశీర్వాదాలు కూడా నీపై ఉండాలి!” అంటూ ఈ సందర్భంగా చిరంజీవి తన కోడలికి వచ్చిన గౌరవ ప్రదమైన పదవి గురించి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Our ‘Kodalu’ is the Co – Chairperson of Telangana Sports Hub now ☺️
Delighted at the appointment of @upasanakonidela to the esteemed position. It is as much an honour as much as it is a great responsibility.
Dear Upasana,
I am sure with your commitment and passion you will…
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 4, 2025
ఇక ఉపాసన ఇలాంటి కీలక బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో మెగా అభిమానులు కూడా ఆమెకు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర(Vishwambhara) సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను టార్గెట్ చేసిన నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.
Also Read: Nani: ఆ స్టార్ హీరో బయోపిక్ పై కన్నేసిన నాని.. సాధ్యమయ్యేనా?