BigTV English

Vishnu Bhagwan : విష్లుభగవానుడ్ని ఈ పూలతో పూజిస్తున్నారా…

Vishnu Bhagwan : విష్లుభగవానుడ్ని ఈ పూలతో పూజిస్తున్నారా…

Vishnu Bhagwan : పుష్పాలతో శ్రీమహావిష్ణువును అర్చిస్తే సిరిసంపదలు అధికంగా లభిస్తాయి. విష్ణువును అర్చించటానికి పువ్వులేవీ లభించని పక్షంలో గరికమొలకలు సమర్పించినా సువర్ణదాన ఫలితం కలుగుతుంది. పురంధి పుష్పాలను, పచ్చ కర్పూరపు వాసనలతో ఉండే ముదురు ఎరుపు దారంతో మాలగా గుచ్చి విష్ణువుకు అర్పించటం ఎంతో శ్రేష్టం. ఇలాంటి దండలతో అర్చిస్తే సర్వ యజ్ఞఫలం లభిస్తుంది,


కుంకమ పూలను కానీ మంకెనపూలను కానీ నల్ల కలువలతో చేర్చి, కూర్చి హరికి సమర్పించినా ఇటువంటి ఫలమే దక్కుతుంది. కేవలం నల్ల కలువలనే సమర్పిస్తే సువర్ణ దానఫలం, వీటినే వంద సమర్పిస్తే వహ్నిష్టోమ ఫలం, వెయ్యి సమర్పిస్తే పౌండరీక యజ్ఞఫలం, లక్ష సమర్పిస్తే రాజసూయ యాగఫలం దక్కుతాయని విష్ణుధర్మోత్తర పురాణం చెబుతోంది. వంద తెల్ల కలువలతో పూజ చేస్తే చంద్రలోకం, వెయ్యి సమర్పిస్తే సువర్ణదానం చేసిన ఫలితం కలుగుతుంది..

ఎర్రటి పద్మాలతో హరిని అర్చిస్తే జూకామల్లెలతో చేసిన దానికన్నా రెండింతల ఫలితం దక్కుతుంది. జాజిపూలతో శ్రీమహావిష్ణువును అర్చిస్తే గంధర్వలోకంలో ఆనందించే అవకాశం లభిస్తుంది. లక్ష జాజిపూలతో అర్చన చేస్తే శ్వేతద్వీపవాస సౌఖ్యం కలుగుతుంది. తెల్లనిపువ్వులు ఏవీ తీసుకువచ్చి పూజచేసినా కోరికలు ఈరేడుతాయి. పచ్చని పూలతో చేసిన పూజ ఆనందకర ఫలితాన్ని ఇస్తుంది.


బంగారు పువ్వులతో రాజసూయ యాగఫలం దక్కుతుంది. రత్నాలతో పూజిస్తే రాజయోగం ప్రాప్తిస్తుంది. పూవులతో గృహాన్నిగానీ, పందిరినికానీ అలంకరించి శ్రీహరికి అర్పిస్తే రాజసూయ అశ్వమేథయాగాల ఫలం పొందవచ్చు. ఇలా శ్రీమహావిష్ణువును పూజిస్తే సర్వశుభాలూ భక్తులకు కలుగుతాయని విష్ణుధర్మోత్తరపురాణం చెబుతోంది.
ఏ పూలతో పూజ చేసినా భక్తుడు స్వయంగా వెళ్లి ఆ చెట్ల నుంచి ఆపూలను తీసుకొచ్చి భగవంతడ్ని అనుగ్రహం ప్రాపిస్తుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×