BigTV English
Advertisement

Weekly Horoscope : ఆగష్టు 11 నుంచి 17 వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా ?

Weekly Horoscope : ఆగష్టు 11 నుంచి 17 వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా ?

Weekly Horoscope: మనిషి జీవితంలో జరిగే అన్ని మంచి, చెడు పనులు గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటాయి. గ్రహాల స్థానాల ప్రకారం 12 రాశుల వారి జీవితంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆగష్టు 11, 2024 నుంచి ఆగస్టు 17, 2024 వరకు మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల జాతకాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి: మేషరాశి వారు ఈ వారం ఆశించిన విజయాలు అందుకుంటారు. అదృష్టం మీకు కలసి వస్తుంది. మీ పిల్లలకు సంబంధించిన మంచి విషయాలను వింటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు మునుపటి కంటే పెట్టుబడిలో లాభాలను పొందుతారు.

వృషభ రాశి: ఈ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకు వెళ్లాలి అనుకునే వారు శుభవార్తలను వింటారు. పెండింగ్‌లో ఉన్న పనులను సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. ఉద్యోగ రిత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.


మిథున రాశి: ఈ సమయంలో మీరు పని భారాన్ని ఎదుర్కునే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడానికి ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. పనుల పట్ల జాగ్రత్త వహించండి. ఆహారం, దిన చర్యపై శ్రద్ధ వహించండి.

కర్కాటక రాశి: సన్నిహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు .పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అనారోగ్యంగా బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార సంబంధిత వ్యక్తులు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

సింహ రాశి: సింహరాశి వారు తమ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. అవాంఛిత ప్రదేశానికి వెళ్లడం ద్వారా లేదా పని బాధ్యత వల్ల మీ మనసు కలవరపడుతుంది. కుటుంబ సభ్యులకు చెందిన సమస్యల గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. మీరు చాలా నష్టాన్ని ఈ సమయంలో భరించవలసి వస్తుంది.

కన్య రాశి: కన్యరాశి వారికి ఈ సమయం అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేయాలనుకున్న పనులు నెరవేరుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు శుభవార్తలు వింటారు. మీ భాగస్వామితో సుదూర లేదా తక్కువ దూర పర్యాటక ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది.

Also Read: జన్మాష్టమి నాడు నెమలి ఈకలతో ఈ 3 పనులు చేస్తే మీకు డబ్బే డబ్బు

తులా రాశి: ఈ రాశివారు తమ కలలను నెరవేర్చుకునేందుకు అనేక అవకాశాలను పొందుతారు. అంకిత భావంతో పని చేస్తే శుభ ఫలితాలను పొందుతారు. మీ పోటీ దారులును అధిగమించడంలో విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది.

వృశ్చిక రాశి: వ్యాపారానికి సంబంధించిన పనులకు ఇది శుభ సమయంగా పరిగణించవచ్చు. ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. ఇంటి మరమ్మత్తు లేదా విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవితంలో ఒడిదుడుకుల సమయంలో మీ భాగస్వామి మీకు సహకరిస్తారు.

ధనస్సు రాశి: ధనస్సు రాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి: ఈ సమయంలో తోబుట్టువుల నుంచి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వివిధ వనరుల నుంచి ఆదాయం పొందుతారు. రుణ భారాన్ని తగ్గించుకోవడంలో విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది.

Also Read: కన్యా రాశిలోకి చంద్రుని ప్రవేశంతో ఈ 4 రాశులకు లక్ష్మి అనుగ్రహం

కుంభ రాశి: ఈ రాశి వారికి ఇది అదృష్టకరమైన సమయం. అన్ని రంగాల్లో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. బంధువులతో ఆనందంగా గడపడానికి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మార్కెట్‌లో విశ్వసనీయత బాగా పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది.

మీన రాశి: ఈ సమయంలో మీరు అనుకున్న పనులు నెరవేరతాయి. శుభవార్తలను అందుకుంటారు. విదేశాల్లో చదువుకోవాలనుకున్న మీ ప్రయత్నాలు నెరవేరుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు . ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×