BigTV English

Lamborghini Urus SE Launched: లంబోర్ఘిని నుంచి మరో లగ్జరీ కారు.. ధర తెలిస్తే దడ పుట్టాల్సిందే..!

Lamborghini Urus SE Launched: లంబోర్ఘిని నుంచి మరో లగ్జరీ కారు.. ధర తెలిస్తే దడ పుట్టాల్సిందే..!

Lamborghini Urus SE Launched: ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ లంబోర్ఘిని లగ్జరీ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దేశీయ మార్కెట్‌లోనూ ఈ కంపెనీ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే చాలా మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేసిన కంపెనీ తాజాగా సరికొత్త ఉరుస్ ఎస్‌ఈని లాంచ్ చేసింది. దీనిని సుమారు రూ.4.57 కోట్ల ప్రారంభ ధరతో తీసుకొచ్చింది. కాగా లంబోర్ఘిని ఉరుస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడం ఇదే తొలిసారి. అందులోనూ పిహెచ్ఈవీ (ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఈవీ)మోడల్‌లో దీనిని తీసుకొచ్చారు.


ఈ కొత్త ఉరుస్ ఎస్‌ఈ కారు అద్భుతమైన పవర్‌ట్రెయిన్‌తో పాటు కొన్ని స్టైలిష్ అప్‌డేట్‌లతో వచ్చింది. ఈ కారు బ్యాక్ సైడ్ టెయిల్ గేట్ కొత్తగా ఉంది. అంతేకాకుండా ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు కూడా ఉన్నాయి. దీంతోపాటు బ్యాక్ సైడ్ కొత్త స్పాయిలర్‌ని గమనించవచ్చు. ఈ కొత్త ఉరుస్ ఎస్‌ఈ చూడటానికి పాతమోడల్‌లా అనిపిస్తుంది. ఇది 35 శాతం అధిక డౌన్‌ఫోర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక బయట డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక దీని పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. ఈ సూపర్ లగ్జరీ ఎస్యూవీ ఇంజిన్ పరంగా అదిరిపోయే అప్డేట్‌లను కలిగి ఉంది.

Also Read: లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌ఈ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు అదుర్స్!


ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో మోటారుతో ఫుల్‌గా ఎలక్ట్రిఫైడ్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 620 బిహెచ్‌పి పవర్, 800 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇందులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్.. 25.9 కెడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ 189 హెచ్‌పి, 483 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఇది 4డబ్ల్యూడీని కలిగి ఉంటుంది. అలాగే ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో 60 కిమీ రేంజ్‌ అందిస్తుంది. దీని గరిష్ట వేగం 312 కి.మీగా నిర్ణయించబడింది. ఈ రేంజ్ కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 స్పీడ్‌ను అందుకుంటుంది.

కాగా ఈ లంబోర్ఘిని ఉరుస్ మొత్తం 7 డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. అందులో నార్మల్ స్ట్రాడా, స్పోర్ట్ అండ్ కోర్సాతో సహా నెవ్, టెర్రా అండ్ సబ్బియాతో అనే మూడు మూడు మోడ్స్‌ ఉన్నాయి. ఇవి కాకుండా హైబ్రిడ్, ఈవీ డ్రైవ్, రీఛార్జ్ అండ్ పెర్ఫిర్మెన్స్ అనే మోడ్స్‌ను కలిగి ఉన్నాయి. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. ఇందులో 12.3 ఇంచుల బిగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందించారు. ఈ స్క్రీన్‌లో లంబోర్ఘిని రివ్యూయెల్టోలో కంట్రోల్స్ అండ్ గ్రాపిక్స్ స్పష్టంగా చూడవచ్చు. అలాగే 12.3 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

Related News

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Big Stories

×