BigTV English

School Teacher: ఆ స్కూల్ టీచర్ అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్.. జీతం మాత్రం ఇండియా నుంచే..

School Teacher: ఆ స్కూల్ టీచర్ అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్.. జీతం మాత్రం ఇండియా నుంచే..

Gujarat: ఆ టీచర్ గుజరాత్‌లోని ఓ పాఠశాలలో చదువు చెబుతున్నట్టుగా రికార్డు ఉన్నది. కానీ, ఆమె చెప్పరు. స్కూల్ ముఖం కూడా చూడరు. కానీ, నెల నెలా జీతం మాత్రం ఠంచనుగా ఆమె ఖాతాలో పడిపోతున్నాయి. ఆమె స్కూల్‌కు రాకపోవడమే కాదు.. అసలు ఆమె ఈ దేశంలోనే లేరు. అమెరికాలో సెటిలయ్యారు. గ్రీన్ కార్డు కూడా పొందిన ఆమె బ్యాంకు ఖాతాలో ఎనిమిదేళ్లుగా గుజరాత్ ప్రభుత్వం వేతనం జమ చేసింది.


గుజరాత్‌లో బనస్కంత జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భావన పటేల్ అనే హెడ్ టీచర్ ఉన్నారు. ఆమె అఫీషియల్‌గా ఫైల్స్‌లో, రోస్టర్‌లో మాత్రమే కనిపిస్తారు. ప్రత్యక్షంగా ఆ స్కూల్‌లో కనిపించే వారు కాదు. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. భావన పటేల్ మేడంను చూసి రెండేళ్లు గడిచిందని చెప్పాడు. గ్రామస్తులకూ ఆ టీచర్ ఎలా ఉంటారో తెలియదు. విద్యార్థులు, గ్రామస్తులు కలిసి భావన పటేల్ అనే టీచర్‌ను తాము పాఠశాలలో ఎన్నడూ చూడలేదని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. స్కూల్ పే రోల్‌లో భావన పటేల్ పేరు ఉన్నదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్థానిక మీడియా ప్రకారం, భావన పటేల్ 2013 నుంచి అమెరికాలోని షికాగోలో నివసిస్తున్నారు. ఆమెకు అమెరికా గ్రీన్ కార్డు ఉన్నది. ఆమె అమెరికాలో సెటిలైనా.. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఉద్యోగిగానే స్కూల్ రోస్టర్‌ ప్రస్తావించేది.


Also Read: YouTube: యూట్యూబ్‌లో ‘నెమలి కూర’ వంటకం.. జంతుప్రేమికుల ఆగ్రహం!

భావన పటేల్ ప్రతి యేడాది దీపావళి పండుగ కోసం ఇండియాకు వస్తుంటారు. ఆ సమయంలో పాఠశాలలు మూసే ఉంటాయి. ఆ సమయంలో కూడా స్కూల్ గురించి తెలుసుకునేవారు కాదు.. విద్యార్థులతో ఇంటరాక్ట్ కూడా ఆమె కాలేదు. కాగా, ఈ వ్యవహారంపై స్కూల్ ఇంచార్జి ప్రిన్సిపల్ పారుల్ మెహెతా స్పందిస్తూ.. తాము ఈ విషయంపై ఇది వరకే తాలూకా విద్యాధికారికి, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చామని వివరించారు. అయితే, భావనకు వ్యతిరేకంగా తాము ఇచ్చిన కంప్లైంట్‌పై ప్రభుత్వం ఇది వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.

గతేడాది జనవరిలో భావన పటేల్ ఈ స్కూల్‌కు వచ్చారని, ఈ ఏడాది నుంచి ఆమె అన్‌పెయిడ్ లీవ్స్ పైనే ఉన్నారని చెప్పినట్టు మీడియా కథనాలు వచ్చాయి. ఆ టీచర్‌కు షోకాజ్ నోటీసులు పంపారని, ఆమె పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరినట్టు తెలిసింది.

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×