Weekly Horoscope: గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జూన్ 1 నుంచి జూన్ 7వరకు ఏఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన అవకాశాలు అందుతాయి.
వృషభం: అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందక ఇబ్బంది పడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. రావలసిన ధనం చేతికి అందడంలో ఆలస్యం అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా రాణించవు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బాధ్యతల వలన విశ్రాంతి లభించదు.
మిథునం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రముఖుల సహాయంతో కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఉన్నా అంతగా ఇబ్బంది కలిగించవు. రుణగ్రస్తుల నుండి రావలసిన ధనం చేతికి అందుతుంది. మొండి బాకీలు తీర్చగలుగుతారు.
కర్కాటకం: ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. నిరుద్యోగులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. ఇతరుల నుండి రావలసిన ధనం అందుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు.
సింహం: చాలా కాలంగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. అవసరానికి చేతికి ధనం అందుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులను సేకరిస్తారు.
కన్య: నిరుద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాలకు అవసరమైన ధనం అందుతుంది. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. రుణ భారం నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని సహాయం అందుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?
తుల: శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుని సహాయ పడతారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార విస్తరణకు ఉన్నటువంటి అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలను చేపడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు అందిన ఒక వార్త ఊరట కలిగిస్తుంది. నూతన వస్త్రా వస్తు లాభాలు అందుతాయి.
వృశ్చికం:ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. సంతాన వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. విద్యా ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు.
ధనుస్సు: భూ సంబంధిత వివాదాలు తొలగి లబ్ధి పొందుతారు. కొన్ని పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. సమాజ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మకరం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది. మంచి ఆలోచన జ్ఞానంతో సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్య పరుస్తుంది. ఇతరుల సమస్యలు సైతం పరిష్కరిస్తారు. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కుంభం: సంతాన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్య పరుస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. నూతన వాహనయోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాలకు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగుతాయి. అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులను పూర్తి చేసుకుంటారు.
మీనం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహా తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ సంబంధిత పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్య నుండి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కలసి వస్తాయి. ప్రభుత్వ సంబంధిత సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు