E-Paper
Advertisement

Horoscope Today June 1st: తెలుగు రాశి ఫలితాలు: ఆ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు     

Horoscope Today June 1st: తెలుగు రాశి ఫలితాలు: ఆ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు     
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జూన్‌ 1న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: సమాజంలో ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు.

Advertisement

వృషభం: బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రు సంభందమైన సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు.

మిధునం: ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఇతరులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

Advertisement

కర్కాటకం: ఇంటా బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు, మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

సింహం: కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

కన్య: అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది.

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

తుల: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం: ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. ఆర్ధిక విషయంలో లోటు పాట్లు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ధనస్సు: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మకరం: ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

కుంభం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంట్లో కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారంలో ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.

మీనం: కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×