BigTV English

Pancha Maha Yagnas : పంచ మహా యజ్ఞాలేమిటో.. తెలుసా..?

Pancha Maha Yagnas : పంచ మహా యజ్ఞాలేమిటో.. తెలుసా..?

Pancha Maha Yagnas : యజ్ఞం అనగానే.. పండితులంతా ఒకచోట కూర్చుని, రోజుల తరబడి వేదాలు చదువుతూ చేసే కృతువు గుర్తుకొస్తుంది. అయితే.. ఇప్పుడు మనం చెప్పుకొనే పంచమహా యజ్ఞాలు అలాంటివి కాదు. ప్రతి మనిషీ తన జీవితంలో నిరంతరం ఆచరించాల్సిన 5 ప్రధాన విధులను పంచమహా యజ్ఞాలుగా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి.


  1. దేవ యజ్ఞం: పూర్వం అన్ని వర్ణాల వారూ రోజూ ఇంటిలో ఒకచోట అగ్నిని ఆరాధించేవారు. భోజనానికి ముందు అందులో తమ శక్తి మేరకు కొన్ని మెతుకులైనా వేసేవారు. కొన్ని వర్ణాల వారి ఇండ్లో కుటుంబ సభ్యులతా అగ్నికి సమిధలు అర్పించేవారు. దీనినే ఆహుతం అంటారు. మనకు అన్నీ ఇచ్చిన పరమాత్మకు అగ్ని ద్వారా మనిషి కృతజ్ఞత తెలుపుకోవటమే దీని ఉద్దేశం.
  2. పితృ యజ్ఞం: కని, పెంచి, పెద్దచేసిన తల్లితండ్రుల పట్ల ప్రేమగా, బాధ్యతగా చివరి వరకు వ్యవహరించటమే పితృయజ్ఞం. ముఖ్యంగా.. వారు తమ దైనందిన జీవిత అవసరాలకు పిల్లల మీద ఆధారపడే దశలో వారికి అన్నివిధాలా అండగా నిలవటమే ఈ పితృయజ్ఞం.
  3. భూత యజ్ఞం: వివాహం చేసుకుని, భార్యాపిల్లలు, కుటుంబంతో జీవించే ప్రతి వ్యక్తి.. తన చుట్టూ బతికే పశుపక్ష్యాదుల మంచిచెడూ చూడాలనేదే భూత యజ్ఞం. పిట్టకు గుప్పెడు గింజలు, చెట్టుకు చెంబుడు నీళ్లు, ఆవుకు నాలుగు పరకల గ్రాసం, ‘అమ్మా.. ధర్మం’ అంటూ వచ్చే బిచ్చగాడికి ఓ ముద్ద అన్నం పెట్టటమే భూత యజ్ఞం. అందుకే తినబోయేముందు ఓ ముద్ద తీసి పక్కకు పెట్టి, దానిని బయటపెడుతుంటారు.
  4. మనుష్య యజ్ఞం: తిథి లేకుండా వచ్చే వాడే అతిథి. అలాంటి అతిథిని ఆదరించి, కులమతాలకు అతీతంగా, నారాయణుడే వచ్చాడనే భావనతో ఉన్నంతలో గౌరవించటమే మనుష్య యజ్ఞం. ముఖ్యంగా ఆపదలో వచ్చి, ఏ అపరాత్రి వేళో ఇంటి తలుపుకొట్టేవారికి చేతనైనంత సాయం చేయాలనేదే దీని ఉద్దేశం.
  5. బ్రహ్మ యజ్ఞం: అందరూ పరమాత్ముడిని తమ జ్ఞానపు పరిధిని బట్టి గుర్తుచేసుకోవాలి. భజన, కీర్తన, జపం, పూజ, పారాయణ, యజ్ఞం.. ఇలా ఎవరి ఆసక్తిని బట్టి దీనిని ఆచరించొచ్చు. రోజూ కొత్త విషయాలను తెలుసుకుకోవటంతో బాటు వాటిని ఇతరులకు వివరించాలి.


Related News

Hyderabad to Tirupati Bus: తిరుపతి భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. డబుల్ హ్యాపీ గ్యారంటీ

Mahaganapathi: గంట కడితే కోర్కెలు తీర్చే గణపతి.. ఎక్కడో తెలుసా?

Ganesh Chathurthi 2025: మొదటి సారి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారా ? ఈ నియమాలు తప్పనిసరి !

Ganesh Puja: గణపతి పూజలో.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఆశీర్వాదాలకు దూరమే!

Sri Padmavathi Ammavari Temple: శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు.. రూ.750 చెల్లిస్తే ఆ సేవలు

Lord Vinayaka – Moon: చంద్రుడు నవ్వినందుకే చవితి శాపమా? అసలు శాస్త్రీయ కారణం ఇదే!

Big Stories

×