BigTV English

Upcoming Movies : డేట్ అనౌన్స్ చేశాక కూడా.. తప్పని వాయిదాల పర్వం..

Upcoming  Movies : డేట్ అనౌన్స్ చేశాక కూడా.. తప్పని వాయిదాల పర్వం..

Upcoming Movies : ఈమధ్య టాలీవుడ్ లో సినిమా రిలీజ్ వాయిదా వేయడం బాగా ఫ్యాషన్ అయిపోయింది .డేట్ అనౌన్స్ చేశాక కూడా 10 -15 రోజులు కాదు ఏకంగా ఆరు నెలలు, సంవత్సరం పాటు వాయిదాలు కొనసాగుతున్నాయి. చిన్న సినిమాలే కాదు పెద్ద స్టార్స్ నటించిన సినిమాలకైనా ఈ అగచాట్లు తప్పడం లేదు. ఒకప్పుడు ఏదన్నా మూవీ పొరపాటున వాయిదా పడితే 15 రోజులు ,మహా అయితే ఒక నెల పట్టేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ మార్చేసింది. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.


ఈ మధ్యకాలంలో అలా వరసగా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ముందుగా ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తరువాత.. సడెన్ గా తిరిగి ఆ మూవీని పోస్ట్ ఫోన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా వాయిదా పడకుండా కరెక్ట్ డేట్ కి రిలీజ్ అయింది అంటే కథతో పాటు కంటెంట్ గురించి కూడా ఆ డైరెక్టర్ కి కంప్లీట్ క్లారిటీ ఉంది అని అనుకోవచ్చు. దాదాపు సగం పైన టాలీవుడ్ చిత్రాలు అనుకున్న డేట్ కంటే వెనక్కి వెళ్తున్నాయి. మరి రిపీటెడ్ గా వాయిదా పడుతున్న ఆ చిత్రాలకు ఏదో చూద్దామా..

టిల్లు స్క్వేర్‌.. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన టిల్లు మూవీ కి సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ఈ మూవీ పై అంచనాలు భారీ గా ఉన్నప్పటికి..మూవీ విడుదల చేయడానికి మేకర్స్ మంచి టైం కోసం చూస్తున్నట్లు ఉన్నారు. అందుకే పెద్ద సినిమాల హడావిడి తగ్గాక విడుదల చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. 


అలాగే పెద్ద సినిమాల సందడి తగ్గాక..ఏ టెన్షన్ లేకుండా మెల్లిగా , కూల్ గా రావొచ్చు అని జూన్ నుంచి ఏకంగా జనవరి 12న ముహూర్తం షిఫ్ట్ చేసిన మూవీ హనుమాన్.ఇక సెప్టెంబర్ 28న రావాల్సిన ప్రభాస్ సలార్ ఏకంగా డిసెంబర్ 22కి వాయిదా పడింది. సంక్రాంతి బరిలోకి దిగాల్సిన ప్రాజెక్ట్ కె అదేనండి కల్కి2898 AD సమ్మర్ ట్రీట్ గా రాబోతోంది.ఇలా చిన్నా పెద్దా తేడాలేకుండా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×