BigTV English

Sri Anjaneya:- ఆంజనేయుడికి ఇష్టమైన అభిషేకం ఏంటి

Sri Anjaneya:- ఆంజనేయుడికి ఇష్టమైన అభిషేకం ఏంటి

Sri Anjaneya:- ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన అభిషేకంతో విశేషమైన ఫలితాలుంటాయి. అభయాన్ని ఇచ్చే హనుమంతుడ్ని పూజించేవారు శ్రీరాముడికి పూజ చేస్తే ఆంజనేయుడు ఎంతో పరవశించిపోతాడు. ధైర్యానికి,బలానికి ప్రతీకగా హనుమంతుడిని భావిస్తాము. ఆపదలో ఉన్న సమయంలో మనం ఆంజనేయుడిని ప్రార్థిస్తే ఆపదల నుంచి బయటపడొచ్చనేది భక్తుల నమ్మకం. మారుతికి అభిషేకం చేయాలనుకునే భక్తులు స్వామి వారికి ఎంతో ఇష్టమైన వెన్నతో అభిషేకం చేయడం వల్ల వారిపై ఉన్న దోషాలు తొలగిపోతాయి.


ముఖ్యంగా అమావాస్య, కృష్ణపక్ష, శుక్లపక్ష నవమి వంటి రోజులలో స్వామి వారికి వెన్నతో అభిషేకం లేదా అలంకరణ చేయడం వల్ల వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు.అదేవిధంగా ఆయురారోగ్యాలను ప్రసాదించడమే కాకుండా, మనలో ఉన్న భయాందోళనలను కూడా ఆంజనేయ స్వామి తొలగిస్తాడని పండితులు చెబుతున్నారు. బజరంగబలికి పూజ చేసే సమయంలో ఎర్రని పుష్పాలను సమర్పించి పూజ చేస్తే స్వామి వారు ఎంతో ప్రీతి చెందుతారు.

ఆంజనేయ స్వామికి భక్తులు మంగళ, శనివారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ప్రతి మంగళ, శనివారాలలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అలంకరణలు చేస్తారు.స్వామివారి అనుగ్రహం పొందడం కోసం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకుల హారం, సింధూరంతో పూజ చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడనీ విశ్వసిస్తారు.
అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణ తర్వాత వడలు, తీపి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి.పూజ అనంతరం సుందర కాండ,హనుమాన్ చాలీసా చదవడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. మహిమ కలిగిన ఆంజనేయుడిని అమావాస్య రోజు పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు. ముఖ్యంగా మంగళవారం అమావాస్య రోజున ఆంజనేయుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.


Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×