BigTV English

Wear ashes:- చితాభస్మాన్ని ఎవరు ధరించకూడదు..?

Wear ashes:- చితాభస్మాన్ని ఎవరు ధరించకూడదు..?

Wear ashes:– చితాభస్మం… ఉజ్జయినిలోని శ్రీ మహాకాల అనే జ్యోతిర్లింగానికి చితాభస్మంతో అభిషేకాన్ని చేస్తారు. చితాభస్మాన్ని కాపాలికులు, మాంత్రికులు, అఘోరీలు, శవసాధకులు, ప్రేతాత్మలను పూజించేవారు. వామచారులు, వామ వర్గాలకు చెందిన వారు ఉపయోగిస్తారు. మాంత్రికుల్లో ఒక నమ్మకం వుంది. తమ గురువుల చితాభస్మాన్ని మాత్రమే వారు ఉపయోగిస్తారు. దీన్ని వాడటం ద్వారా తమ గురువుల ఆత్మ తమతోనే ఉంటుందని నమ్మకం. నియమానుసారం చితాభస్మాన్ని ధరిస్తే ప్రేతాత్మలు భస్మధారణ చేసిన వారి మాటను ఎప్పుడూ వింటూనే ఉంటాయని మంత్ర రహస్యాల్లో వివరించబడి ఉంది.


అయితే శ్రీ మహాకాల జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన భస్మం ప్రసాదంగా మారుతుంది. ఇది ఎటువంటి హానీ కలిగించదు. ఇది క్షేత్ర మహిమ అంటూ పండితులు చెబుతున్నారు. హోమభాస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడుతాయి .హోమభాస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటంగా జరుగుతాయి . భస్మధారణతో అన్ని రకాల గోచర ,అగోచర ,దృశ్య ,అదృశ్య రోగాలు తొలగిపోతాయి

శివుని దేవాలయ భస్మం
ఈ భస్మంని ధరించడం ద్వారా దేహంలో కాంతి వస్తుంది . దేహంలో అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి. రక్త పోటు లేదా హైపర్ టెన్షన్ ఉన్నవారు దీనిని పెట్టుకొంటే రక్త పోటు సాధారణ స్టితికి వస్తుంది . మనసుకి ప్రశాంతత కలుగుతుంది. భస్మాన్ని ధరించే వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడుతుంటారు. ఎక్కువుగా మాట్లాడే వారు తక్కువ చేస్తారు మనసును ఏది బాధించదు.


శ్రీ సుబ్రమణ్య దేవాలయ భస్మం
ఈ భస్మం ధారణకు యోగ్యమైనది .ఈ భస్మం దేహoలొ కాంతి తేజస్సు వృద్ది చేస్తుందినరాల బలహీనత ఉన్నవారు దీన్ని ధరిస్తే త్వరగా కోలుకొంటారు మూర్చ వ్యాధి ఉన్నవారు సుబ్రమణ్య దేవుని ప్రసాద భస్మాన్ని 18 నెలలు పెట్టుకొంటే మరల ఎప్పుడు మూర్చ దరిచేరదు చిన్నపిల్లలకు వచ్చే బలగ్రహ దోషాలు భస్మం పెట్టుకోవడం ద్వార తొలగిపోతాయి . ఎవరికీ అయితే నత్తి సమష్య ఉంటుందో అటువంటి వారు దేవుని పేరు చేప్పుకొని ఈ భాస్మమ్ని నుదుట పెట్టుకొని భక్తితో భస్మాన్ని పాలలో వేసుకొని త్రాగుతూ ఉంటీ నత్తి పూర్తిగా తొలగి అందరిలాగా చక్కగా మాట్లడుతారు .

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×