
Money Plant: గణేశుని పూజలో వాడే పత్రిలో గరికకే అధికప్రాధాన్యం. వినాయకుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా పర్వాలేదంటారు. నాలుగైదు రెబ్బలు గరికను గణేశుడి పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు తమిళనాడులో వాడవాడలా కనిపించే గణేశుని ఆలయాలలో, భక్తులు స్వామివారికి గరికనే అర్పిస్తారు. సంప్రదాయ వైద్యంలో ఈ గరికకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గరికకు త్రిదోషాలనూ హరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. రక్తస్రావాన్ని అరికట్టడంలోనూ గరికకు సాటిలేదు. అందుకనే దెబ్బలు తగిలినప్పుడు, ఇప్పటికీ గరికను అప్పటికప్పుడు నూరి గాయానికి పట్టించేవారు పెద్దలు. గరిక తలనొప్పికి ఔషధంగా పనిచేస్తుంది.
గరిక మొక్కనే దూర్వ అంటారు. ఇది గడ్డి జాతికి చెందింది. గ్రహణాల సందర్భంగా గరికనే వాడతారు. గ్రహణాల సమయంలో వెలువడే విష కిరణాల నుంచి గరిక కాపాడుతుంది. గరిక మొక్కను వాస్తు ప్రకారం దక్షిణ దిశలో ఉంచుకూడదు. ఇంట్లో తూర్పు , ఉత్తర మూలల్లో ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఉంచకూడని దిశలో ఉంచితే చెడు ఫలితాలు కలుగుతాయి. మనీ ప్లాంట్ సంపదకు చిహ్నమైతే గరిక మొక్క ఎన్నో రకాల ఇబ్బందుల్లో పడకుండా కాపాడుతుంది.
దేవతా విగ్రహం యొక్క పాదాల నుండి శక్తి తరంగాలు విపరీతం గా వెలువడుతాయి.అందువల్ల మొట్ట మొదట పాదాల వద్ద అర్పించిన దూర్వా
గరికలో ఈ శక్తి తరంగాలు గ్రహిస్తాయి. ఇది పూజ చేసే భక్తునికి శ్రేయస్సు ని కలగచేస్తుంది.దూర్వా గరికల ద్వారా వెలువడే ఈ శక్తి తరంగాల వల్ల పరిసరాల్లోని రజ-తమో గుణాలవల్ల కలిగే ప్రతికూల ప్రభావాల్ని తగ్గిస్తుంది.