BigTV English

Bathukamma 2024: మూడవ రోజు బతుకమ్మకు.. ఏ నైవేద్యం సమర్పిస్తారు ?

Bathukamma 2024: మూడవ రోజు బతుకమ్మకు.. ఏ నైవేద్యం సమర్పిస్తారు ?

Bathukamma 2024: బతుకమ్మ పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండగ సమయంలో పువ్వుల్ని దేవతలుగా భావిస్తారు. బతుకమ్మ పండగ సమయంలో తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.


ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా పండగను జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో పండగ ప్రారంభం అవుతుంది. ఈ బతుకమ్మను పేర్చేందుకు అందమైన రంగురంగుల పూలన్నీ కోసి బతుకమ్మను పేరుస్తారు. 9 రోజులు బతుకమ్మను పేర్చి 9 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.

ఇప్పటికే ఎంగిలిపూల బతుకమ్మతో పాటు, అటుకుల బతుకమ్మలు ముగిసాయి. మూడవ రోజు అంటే అక్టోబర్ 4 న ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు అందంగా బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను ఉంచి నైవేద్యంగా ముద్దపప్పు, బెల్లం, పాలను సమర్పిస్తారు.


Also Read: 100 ఏళ్ల తర్వాత రెండు రాజయోగాలు.. వీరికి అదృష్టం

పూల పండగ అయిన బతుకమ్మ సంబరాల్లో మూడవ రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ముద్దపప్పును ప్రధాన నైవేద్యంగా సమర్పిస్తారు. కాబట్టి ఆ బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు బతుకమ్మను ముఖ్యంగా మందారం, చేమంతి, రామబాణం తదితర పూలతో పేర్చుతారు. ఆ తర్వాత వాటిపై గౌరమ్మను ఉంచి పూజిస్తారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×