E-Paper
Advertisement

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, కానీ ఆడియన్స్ ను రప్పించడానికి అదనపు ఖర్చు

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, కానీ ఆడియన్స్ ను రప్పించడానికి అదనపు ఖర్చు
Advertisement

Devara: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవర. సెప్టెంబర్ 27న భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఏ సినిమా పూర్తిస్థాయిలో వాటిని అందుకోలేదు అనేది వాస్తవం. కానీ కొంతమందికి విపరీతంగా నచ్చింది, మరి కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పరవాలేదులే అనిపించింది. అయితే ఎన్టీఆర్ లో మేజర్ ప్లస్ పాయింట్ ఎన్టీఆర్ డాన్స్. ఈ సినిమా మొదట్లోనే ఐదు పూజ సాంగ్ అందరికీ మంచి కిక్కించింది. అయితే సినిమాలో అందరూ కూడా ఎక్కువగా వెయిట్ చేసింది “దావూదీ” సాంగ్. సినిమా ఫస్ట్ ఆఫ్ అయిపోయిన తర్వాత కొద్దిపాటి సంతృప్తితో ఉన్న ఫ్యాన్స్ కి సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోద్దిలే అనుకున్నారు. కానీ ప్రేక్షకులకు ఎక్కువ శాతం సెకండాఫ్ బోర్ కొట్టించింది. దానికి తోడు దావూదీ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తూ కూర్చున్నారు కానీ సినిమాలో ఆ పాట రాలేదు.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మాత్రం కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. నార్త్ లో కూడా ఈ సినిమా మెల్లమెల్లగా పుంజుకుంటుందని కొన్ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి ఈ సినిమాకి నిరాశ ఎదురవుతుంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఏకంగా ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. చాలామంది ఆడియన్స్ మాత్రమే ఈ సినిమా గురించి మాట్లాడితే తప్ప ఒక్క సెలబ్రిటీ కూడా ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఒపీనియన్ తెలపలేదు. అంటే ఈ సినిమా చూసి కూడా వాళ్లకు నచ్చలేదా అనేది కొంతమంది ఆలోచన.

Advertisement

ఇకపోతే ఎన్టీఆర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎంతగానో ఎదురు చూసినా దావూదీ సాంగును చిత్ర యూనిట్ రేపటి నుంచి యాడ్ చేయనుంది. అయితే ఆడియన్స్ రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. దాదాపు ఈ సినిమాలో పాటను యాడ్ చేయడానికి పాతిక లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అయితే ఎన్టీఆర్ లోని డాన్స్ ను వెండితెర మీద చూడాలని ఆత్రుత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా కోసం వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ లో కూడా కీలక అంశాలు చూపించనున్నాడు కొరటాల. అయితే ఈ సినిమాకి మొదట మిశ్రమ స్పందన లభించింది. అందుకోసమే ప్రస్తుతం ఈ సినిమా ఇంకా ఊపందుకోలేదని చెప్పాలి.

ఇక కొన్ని ఏరియాల్లో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ సినిమా వల్ల ఒక 20% నష్టాలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ దసరా హాలిడేస్ లో ఫ్యామిలీస్ ఈ సినిమాను చూస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి కొరటాల శివ మాత్రం ఆచార్య డిజాస్టర్ నుంచి సేఫ్ అయిపోయాడు అని చెప్పాలి. ఇంక రాజమౌళి మిత్ ను తిరగరాసాడు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు గాని అది అప్పుడే తేలేలా లేదు. ఇక కొత్తగా యాడ్ చేసిన దావూదీ పాట ఎంతమందిని థియేటర్ కు నడిపిస్తుందో వేచి చూడాలి.

Advertisement

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×