Big Stories

Sri Ram Navami: శ్రీ రామనవమి రోజున ఏం చేయాలి?

Sri Ram Navami: రా..మ.. అంటే కేవలం రెండు అక్షరాలు కాదు.. అదో మహాశక్తి మంత్రం. శ్రీ మహా విష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి.

- Advertisement -

శ్రీరామ నవమి రోజున ప్రతిఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం ఆచరించాలి . ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. నూతన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో, కుదరనిపక్షంలో దేవాలయాల్లో శ్రీరాముడు, సీతాదేవి,హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్టచేయాలి. ధ్యాన ఆవాహనాధి షోడశోపచారాలతో శ్రీరామచంద్రుడిని పూజించాలి.

- Advertisement -

ఈ పూజలో శ్రీ సీతారాముడిని అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. ఇలా పూజించి రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఈ రోజు ఉపవాసం, జాగరణ చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడంవల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి.

శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల మాట. ఈరోజు రామనామస్మరణ చేయడం, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి, జయాలు సిద్ధిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News