BigTV English
Advertisement

Yadadri Brahmotsavam:యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే…..

Yadadri Brahmotsavam:యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే…..

Yadadri Brahmotsavam:తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి. తెలంగాణలో కొలువుదీరిన యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలకి సిద్ధమవుతోంది. స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు వేడుకలు జరుగనున్నాయి. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత జరుపుతున్న తొలి బ్రహ్మోత్సవాలు ఇవే. దీంతో మొదటి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానాలయం మాఢవీధుల్లో కళ్యాణం నిర్వహించనున్నారు.


బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన సుదర్శన నరసింహ హోం, నిత్య కల్యాణం, తాత్కాలికంగా ఆలయ అధికారులు రద్దు చేశారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సాయంత్రం అంకురారోహన జరుగనున్నాయి. 22న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, భేరీపూజ, దేవత ఆహ్వానం, హవనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 23 నుంచి ఉదయం, రాత్రి సమయంలో వాహనసేవలు నిర్వహించనున్నారు.

23న మత్స్యావతార అలంకారసేవ, వేదపారాయణం, శేషవాహన సేవ జరుగనున్నది. 24న వటపత్రశాయి అలంకార సేవ, హంసవాహనసేవ, 25న శ్రీకృష్ణాలంకరణ సేవ, పొన్న వాహనసేవపై లక్ష్మీనరసింహస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు. 26న గోవర్ధనగిరిధారి అలంకారసేవ, రాత్రి సింహ వాహనసేవ, 27న జగన్మోహిని అలంకారసేవ, అశ్వవాహనసేవలు, 28న ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై, రాత్రి గజవాహన సేవతో పాటు స్వామి అమ్మవార్ల తిరుకల్యాణం నిర్వహిస్తారు. మార్చి 1న గరుడ వాహనసేవ, దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 2న మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్పయాగం, దేవతోద్వాసన, 3న అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.


Kali Matha : కాళీ మాతకు చైనీస్ ఫుడ్

Nagamalli Flower : భోళాశంకరుడు మెచ్చిన నాగమల్లి పుష్పం

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×